Rahul Gandhi in AP: కర్నూలు జిల్లాలో మొదలైన రాహుల్ పాదయాత్ర, రాష్ట్రంలో మొత్తం 119 కి.మీ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేటి ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది.
ఈ యాత్రకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం క్షేత్ర గుడి నుండి ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుంటారు.
ఆలూరు నగర శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభం, రాత్రి ఏడున్నర గంటలకు నేటి పాదయాత్ర విరామం తీసుకుంటారు.
19వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.
ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.
20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది.
సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. (All Images Credit: Twitter/Congress)