TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని సీఎం జగన్ ను వినిపించేలా ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని టీడీపీ క్యాడర్ విస్తృతంగా నిర్వహించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలోకేష్ ఢిల్లీ నుంచి మోత మోగిద్దాంలో పాల్గొని చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి డ్రమ్స్ వాయిస్తూ నిరసనలో పాల్గొన్నారు.
లోకేష్ తో పాటు పార్టీ ఎంపీలు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సైతం శబ్దాలు చేస్తూ మోత మోగింపులో పాల్గిని నిరసన తెలిపారు
రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణి, హైదరాబాద్ భువనేశ్వరి విజిల్ మోగించి, డ్రమ్ మోగించి తమ నిరనస తెలిపారు.
ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు తమకు నచ్చిన పద్దతిలో మోత మోగించారు.
ఐదు నిమిషాల పాటు ప్రజలు అంతా తమకు ఇష్టమైన పద్దతిలో శబ్దం చేసి నిరసన చేపట్టాలని.. మోత మోగిద్దాం పేరుతో ప్రచార కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.
టీడీపీ నేతలు .. టీడీపీ అభిమానులు.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేవారు ఎక్కడిక్కడ తమకు అనుకూలమైన పద్దతిలో నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులతో పాటు చంద్రబాబు అరెస్టు అక్రమం అని భావిస్తున్న వారు పలు చోట్ల రోడ్ల మీదకు వచ్చి శబ్దంచేశారు.
న్యాయం గెలవాలని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని నారా బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.