Chandrababu Tour : చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత, కాన్వాయ్ ను అడ్డుకోవడంతో కాలినడకన అనపర్తికి!
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మూడో రోజు ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి దేవీచౌక్ వద్ద చంద్రబాబు సభకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు ఇవాళ అనుమతి నిరాకరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనపర్తి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ ను బలభద్రాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనపర్తిలో వెళ్లకుండా పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డుపై కూర్చున్నారు.
చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పోలీసు వాహనాన్ని పెట్టి ముందుకు కదలకుండా కట్టడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పెట్టిన బస్సును టీడీపీ శ్రేణులు కాల్వలోకి తోసేసే ప్రయత్నం చేశారు.
ఎంతసేపటికీ పోలీసులు వాహనాన్ని అడ్డుతీయకపోవడంతో చంద్రబాబు కాన్వాయ్ దిగి పాదయాత్రగా అనపర్తి బయలుదేరారు.
బలభద్రపురంలో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ షోకు నిన్న అనుమతి ఇచ్చి ఇవాళ ఎలా రద్దు చేస్తారని మండిపడ్డారు.
ఎంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడతారో చూస్తామని, టీడీపీ కార్యకర్తలు ముందుకు వస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవని చంద్రబాబు అన్నారు. పోలీసులకు సహాయనిరాకరణ చేస్తానన్నారు.
బలభద్రాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా పయనమయ్యారు.
పాదయాత్రగా అనపర్తికి బయలుదేరిన చంద్రబాబు