CM Chandrababu: శపథం చేసి సాధించారు - అవమానంతో బయటకు వెళ్లి విజయగర్వంతో సభలోకి, ప్రతి టీడీపీ కార్యకర్త తలెత్తుకునే ఫోటోలివే!
ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతూ సభ్యులకు సీఎం చంద్రబాబు అభివాదం చేశారు. ఈ ఫోటో చూస్తే ఎన్నో అవమానాలను ఎదుర్కొని విజయ గర్వంతో సభలోకి అడుగు పెట్టిన ఓ పోరాట యోధుడు కనిపిస్తున్నారంటూ టీడీపీ నేతలు భావిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆనాడు చంద్రబాబు శపథం చేశారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి అప్పుడే అసెంబ్లీలోకి అడుగు పెడతానని అన్నారు. చెప్పినట్లుగానే చారిత్రాత్మక విజయంతో సభలోకి అడుగుపెట్టారు.
ఇది కదా గూస్ బంప్స్ తెప్పించే ఫోటో. సభలో తొలిసారి అడుగు పెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
సంతోషంలో చంద్రబాబు, పవన్. అవమానాలు ఎదుర్కొని విజయ గర్వంతో సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్. ఇది నిజంగా ఫోటో ఆఫ్ ది డేనే.
'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఇలా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టడంతో చంద్రబాబుకు జయ ధ్వానాలు పలుకుతూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందు సభలో సీఎం చంద్రబాబు.
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సంతకం చేస్తున్న చంద్రబాబు.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీఎం చంద్రబాబు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.