Kalyani Priyadarshan: అందమైన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ కాకముందు ఏం చేసేదో తెలుసా!
రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మలయాళ డ్రామా మూవీ వర్షంగళ్కు శేషం (Varshangalkku Shesham) ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నివీన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు..
2017 లో అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కల్యాణీ ప్రియదర్శన్. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగంలో నటించింది. ఒకప్పటి మలయాళ టాప్ నటి అయిన లిజి కుమార్తె అయిన కళ్యాణీ ఇండస్ట్రీలో బిజీగా ఉంది...
కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి కూడా ఒక నటుడు ,దర్శకుడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు కళ్యాణీ ప్రియదర్శన్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే కళ్యాణీ..హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఫిట్ నెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.
కళ్యాణి ప్రియదర్శన్ చదువంతా సింగపూర్, న్యూయార్క్ లో సాగింది. ఈమెకి సిద్ధార్థ్ ప్రియదర్శన్ అనే సోదరుడు ఉన్నాడు.
కళ్యాణి ప్రియదర్శన్ (image credit:Kalyani Priyadarshan/Instagram)
కళ్యాణి ప్రియదర్శన్ (image credit:Kalyani Priyadarshan/Instagram)