In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతలు కలిశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడలోని పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
సినీ పరిశ్రమ ఇబ్బందులను నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వనీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సుప్రియ..
ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు కలిశారు.
కల్కి 2898 ఏడీ సినిమా వచ్చే వారం విడుదల అవుతున్న సందర్భంగా ఓ వారం రోజుల పాటు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించారు.