In Pics: కడపలో గల్లీగల్లీ, ప్రతిఊరు తిరుగుతా - రేవంత్, వైఎస్ఆర్ జయంతి వేడుకల ఫోటోలు
‘‘కడప ఉప ఎన్నిక వస్తుందట. అదే జరిగితే నేను భాధ్యత తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడప లోనే ఉంటా.. గల్లీ గల్లీ తిరుగుతా.. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు. ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం. మీరందరు కలిసి రండి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరిలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సభకు రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో సహా హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిల రేవంత్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఏపీలో బీజేపీ అధికారంలో ఉందని.. బీజేపీ అంటే బాబు - జగన్ - పవన్ అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలకపక్షమే ఉందన్నారు. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారని అన్నారు.
‘‘2029లో వైఎస్ షర్మిల ఏపీ సీఎం అవుతారు. అదే ఏడాదిలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారు. ఇదే వైఎస్ చివరి కోరిక. చాలా మంది ఆయన పేరు చెప్పుకొని లాభపడ్డారు. ఎన్నో వ్యాపారాలు చేశారు. ఆశయాలను మోసేవాళ్లనే అసలైన వారసులుగా గుర్తించాలి. వైఎస్ పేరు మీద వ్యాపారాలు చేసేవారు వారసులు అవుతారా?’’ అని రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన పార్టీ అయిన బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ రాజకీయ వారసులు ఎలా అవుతారని షర్మిల అన్నారు. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ప్రధాని కావాలని మొదట చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్ అని షర్మిల గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఏపీ ప్రజలకు మేలు చేశారని షర్మిల అన్నారు.