In Pics: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్, టీటీడీ ఉద్యోగులకు సూటి ప్రశ్నలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డూలో జంతు నూనెలు కలవడం పట్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
‘‘ఆశ్రయం ఇచ్చిన స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే పరిశీలించకపోవడం టీటీడీలో పనిచేస్తున్న హిందువులు చేసిన తప్పు.
కోట్లాదిమంది శ్రీవారిని నమ్మే భక్తులను తిరుమల లడ్డూ కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసింది. ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడి గా భావిస్తున్నాను, దీనిని అందరూ మతాలకు అతీతంగా ఖండించాలి.
టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులు, స్వామి వారి భక్తులు అక్కడ తప్పు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ఆర్ సీపీ నాయకులకు భయపడ్డారా? మీరు ప్రశ్నించాలి కదా, స్వామి వారికి దారుణం జరగకుండా చూడాలి కదా?’’ అని అని పవన్ కల్యాణ్ అన్నారు.