Satyabhama Serial Today September 23rd:క్రిష్ తన కొడుకే కాదన్న మహదేవయ్య.. ఆ భయంకర నిజాన్ని సత్య భర్తకు చెప్పగలదా - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 23 ఎపిసోడ్ హైలెట్స్!!

దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం మూవీ స్టోరీలా ఉంది సత్యభామ సీరియల్ కథ. శనివారం ఎపిసోడ్ లో ఇచ్చిన కమింగప్ తో ఆ విషయం ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినట్టే..
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ప్రస్థానం సినిమాలో పవిత్ర లోకేష్ భర్తని చంపేసి..ఆ స్థానంలోకి వస్తాడు సాయికుమార్. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం మాత్రమే. పవిత్ర లోకేష్ కొడుకు శర్వానంద్ ని కూడా తన కన్నబిడ్డలానే చూసుకుంటున్నట్టు నటిస్తాడు సాయికుమార్...

సినిమా ఆద్యంతం కూడా సాయికుమార్ తన కన్న కొడుకైన సందీప్ కిషన్ కి అన్యాయం చేసి..పెంపుడు కొడుకైన శర్వానంద్ కే ఫేవర్ చేస్తున్నాడని అనుకుంటారు.. కానీ ట్విస్ట్ రివీల్ అయ్యాక ప్రేక్షకులు పెద్ద షాక్ తగులుతుంది.
కేవలం తన కన్న కొడుకు దర్జాగా బతకడం కోసం భారీగా ఆస్తులు కూడబెట్టి తన పేరుమీద పెట్టి... తన రాజకీయ ఎదుగుదలకు, సెక్యూరిటీ కోసం పెద్ద కొడుకు శర్వానంద్ ని వాడుకుంటాడు సాయికుమార్...ఈ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథ జోరందుకుంటుంది...
సేమ్ టు సేమ్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లోనూ అదే జరుగుతోంది.. బాపూ బాపూ అని క్రిష్ తండ్రి మహదేవయ్యపై ప్రేమను చూపిస్తాడు.. తండ్రికి తగలాల్సిన కత్తిపోటుని తాను బలవుతాడు...కానీ క్రిష్ తన సొంత కొడుకు కాదుఅని మరో కొడుకు, తనపై హత్యాయత్న చేసిన రుద్రకి క్లారిటీ ఇస్తాడు మహదేవయ్య
ఈ భయంకర నిజాన్ని వినేస్తుంది సత్య.. ఓ వైపు భర్త తండ్రికోసం తపించిపోతుంటే...ఆ తండ్రికి క్రిష్ అంటే ప్రేమ లేదని అర్థమవుతుంది.. ఇప్పుడీ నిజాన్ని సత్య క్రిష్ కి చెబుతుందా? చెప్పినా క్రిష్ నమ్ముతాడా? ఈ కుట్రల నుంచి క్రిష్ ని సత్య ఎలా కాపాడుకుంటుంది..
ఇప్పటివరకూ ఓ లెక్క అన్నట్టు...సత్యభామ సీరియల్ సెప్టెంబరు 23 సోమవారం నుంచి మరింత ఆసక్తికరంగా సాగనుంది...