In Pics: డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటేరియట్‌కు పవన్, దారి పొడవునా పూలతో స్వాగతం - ఫోటోలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నేడు (జూన్ 18) ఏపీ సచివాలయానికి వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉపముఖ్యమంత్రి హోదాలో ఆయన సచివాలయానికి వస్తుండడంతో విపరీతమై ప్రాధాన్యం సంతరించుకుంది.
అమరావతి రైతులు పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. పెద్ద జనం అక్కడికి చేరారు. సీడ్ యాక్సెస్ రోడ్ పై పవన్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా.. ఇరు వైపుల నుంచి పూలు చల్లుతూ పవన్ కు జనం స్వాగతం పలికారు.
మందడం గ్రామంలో గ్రామస్తులు ఆయనపై పూలవర్షం కురిపించారు. పవన్ తన వాహనం సన్ రూఫ్ నుంచి ప్రజలకు అభివాదం చేశారు.
పలువురు యువత పవన్ కాన్వాయ్ వెంట బైక్ లు వేసుకొని కేరింతలు కొడుతూ వచ్చారు. మరికొంత మంది కాన్వాయ్ వెంట పరిగెడుతూ వచ్చారు.
కాన్వాయ్ వాహనం ఆగిన చోట పవన్ కల్యాణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. అలా ఆయన్ను తాకగానే వారి ఆనందం రెట్టింపు అయి మరింత ఎక్కువగా కేరింతలు కొట్టారు.
ఓ యువతి కూడా పవన్ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి సమాంతరంగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై పరిగెత్తింది. పవన్ కల్యాణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
ఎంతో మంది జనం గుమిగూడడం, కేరింతలు, ఉత్సాహాల నడుమ పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ బుధవారం (జూన్ 19) బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఒక రోజు ముందుగానే అమరావతికి చేరుకున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్‌కు గన్నవరం ఎయిర్ పోర్టులో జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు స్థానిక అమరావతి ప్రాంత రైతులు నిరాజనాలు పట్టారు.
మొదటిసారి సచివాలయానికి వెళ్లి సెకండ్ బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించారు. రెండో బ్లాక్‌లోని ఫస్ట్ ఫ్లోర్లో 212 గదిని పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. తన పేషీని కూడా పవన్ కల్యాణ్ చూశారు.
పవన్ కల్యాణ్ వెంట జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.
వీరు ఇప్పటికే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో పవన్ కల్యాణ్