Nara Lokesh: మెకానిక్ అవతారమెత్తిన లోకేష్, చిట్‌చాట్ లో ఆసక్తికర విషయాలు చెప్పిన యువనేత
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం 165వ రోజుకు చేరుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలోకేష్ పాదయాత్ర ప్రస్తుతం బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది.
చీమకుర్తి మీదుగా సంతనూతనపాడులో లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
మంగళవారం సాయంత్ర సంతనూతనపాడులో బైక్ మెకానిక్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో చిట్‌చాట్ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మెకానిక్ లతో చిట్ చాట్ లో లోకేష్ ఓ అసక్తికర విషయం తెలిపారు. చిన్నప్పుడు తాను చిన్న కారు తయారు చేశానని చెప్పారు.
1997- 1998 సమయంలో జూబ్లీహిల్స్ లో తనకు మెకానిక్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు. బైక్ ఇంజిన్ సహాయంతో కారు తయారు చేసినట్లు తెలిపారు.
ఇంటర్ పూర్తయ్యాక మూడు నాలుగు నెలల సమయం శ్రమించి కారు తయారు చేశానన్నారు.
కార్లు, బైక్ రిపేర్ గురించి, ఇంజిన్ ఎలా ఉంటుంది అని అప్పుడే తెలుసుకున్నానని చెప్పారు లోకేష్.
ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే ఉందని ఆసక్తికర విషయాలు తెలిపారు. మా అబ్బాయి దేవాన్ష్ ఆ కారులో తిరగాలని తనకు చిన్న కోరిక ఉందన్నారు.
ఇప్పుడు పోలీసులు చాలా కఠినంగా ఉన్నారని, గతంలో అలాంటి పరిస్థితి లేదని కొంచెం ఈజీగా ఉండేదన్నారు.
ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే అప్పుట్లో కారులో తిరిగేవాళ్లమని, ఇప్పుడు చాలా కష్టమని చెప్పారు. మెకానిక్ ఫ్రెండ్స్ ఉండటంతో మీ సమస్యలు నాకు అప్పటినుంచే తెలుసునన్నారు.
తాను బైక్ ఎక్కి చాలా రోజులైందని చెప్పారు లోకేష్. చివరిసారి అంటే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు మంగళగిరిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బుల్లెట్ బైక్ నడిపానని గుర్తు చేసుకున్నారు లోకేష్.