ఫోటోలు: పెడనలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, జనసంద్రంగా మారిన ప్రాంతం
క్రిష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వారాహి యాత్ర నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేంద్రం ఇచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వైసీపీ నేతలు సగానికి సగం దోచేసుకున్నారని జనసేనా పవన్ కల్యాణ్ ఆరోపించారు.
2024 ఎన్నికలకు పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తనకు ఇబ్బందిగా ఉన్నా భాగస్వామ్య కూటమి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పలేదన్నారు పవన్ కల్యాణ్.
టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ జగన్ ను పాతాళానికి తొక్కేయవచ్చని స్పష్టం చేశారు.
టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, మీ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.
అయితే పవన్ పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఎన్డీఏ నుంచి తప్పుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారా అనే చర్చ మొదలైంది.
ఏపీలో ఏం జరుగుతుందో ప్రధానికి తెలియదా అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ప్రధానికి తెలిసిన వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? ప్రశ్నించారు.
తాను ఎప్పుడు ప్రధానికి కంప్లయింట్ చేయలేదన్నారు. కేసులకు భయపడే వాడినైతే రాజకీయాల్లోకి రానన్నారు.
వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదన్న పవన్, నాపై కేసులు పెట్టుకోవచ్చని, ఎక్కడికైనా వస్తానని స్పష్టం చేశారు.
తాను ప్రజారాజ్యం యువ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నపుడు, జగన్ రాజకీయాల్లోనే లేడని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే గొడవ పెట్టుకున్నానన్న పవన్, ఎవరికి భయపడనని స్పష్టం చేశారు.
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.