Pawan Kalyan: ఇప్పటం పర్యటనలో పవన్ తగ్గేదేలే - అరెస్టు చేసుకోనివ్వండి అంటూ ఫైర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు కంచెలు వేశారు. అయినా పవన్ ఈ విషయంలో వెనుకాడలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ వారిపై సీరియస్ అయ్యారు.
రోప్ టీం ఆయన్ని ఆపేందుకు యత్చినా వాటిని దాటుకొని సుమారు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు.
పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం చేరుకున్నారు.
రాష్ట్రంలో రోడ్లు వేయలేరు... గుంతలను పూడ్చలేరు కానీ.. రోడ్లు విస్తరణ పేరుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా అని నిలదీశారు. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వానికి బుద్ది ఉందా... తాము ఏమైనా గూండాలమా.. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని జనసేనా ప్రశ్నించారు. (ALL Photos Credit: Twitter/ JanasenaParty)
ఇప్పటంలో బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.
తమను నోటీసులిచ్చిన గంటల వ్యవధిలో ఇళ్లు కూల్చివేశారని జనసేనానికి వివరిస్తూ బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.