PV Sindhu Meets Pawan Kalyan: సార్, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన తండ్రి పి.వి. రమణతో కలిసి వచ్చిన పీవీ సింధు తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు.
ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.
పీవీ సింధు, పీవీ రమణతో మాట్లాడి వివాహ ఏర్పాట్లు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్
తన వివాహానికి రావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులతో సమావేశమై వారికి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు పీవీ సింధు. ఈ మధ్య కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు.
మరో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి తన వివాహానికి రావాలని ఆహ్వానించారు.
విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు.
శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికిరావాలని ఆహ్వానించారు.