NTR Statue In Atlanta : మహిళలకు ఆస్తిలో ఎన్టీఆర్ వాటా ఇస్తే, తల్లి,చెల్లిని జగన్ రోడ్డుకీడ్చారు- అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టిడిపి ఎమ్మెల్యేలు
అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్స్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇందులో మంత్రి నారా లోకేష్ సహా టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారన్నారు గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము
తెలుగుజాతిలో ఎన్టీఆర్ అంతటి పేరుప్రఖ్యాతులు గడించిన నేత మరొకరు లేరని అభిప్రాయపడ్డారు రాము.
ఎన్ఆర్ఐలంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగి, చంద్రబాబు, లోకేష్ ప్రయత్నాలకు అండగా నిలవాలని రాము పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణం లోకేష్, పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని రాము అన్నారు.
స్టాన్ ఫోర్డ్ వంటి విద్యాసంస్థలో చదివి రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నేత నారా లోకేష్ అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు.
వైసీపీ అయిదేళ్ల పాలనలో ఖజానా ఖాళీ చేశారని ఎన్ఆర్ఐలు ఆయా నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలన్నారు సురేష్
భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థలో ఎన్ఆర్ఐలది కీలకపాత్ర, అమరావతిలో పెట్టుబడిలో పెట్టండని పిలుపునిచ్చారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
మహిళలకు ఆస్తిలో సమానహక్కు చట్టాన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని జగన్ ఆ చట్టాన్ని గౌరవించక తల్లి,చెల్లికి అన్యాయంచేసి రోడ్డుకీడ్చారని విమర్శించారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
ఏపీ ప్రభుత్వానికి ఎన్ఆర్ఐలంతా అండగా ఉంటామని నిస్వార్థంగా పార్టీ కోసం పని చేసిన ఎన్ఆర్ఐలను గుర్తించాలని లోకేష్‌కు యుఎస్ఎ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడు కోమటి జయరాం అభ్యర్థించారు.
చివరిగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న భారతీయులను ఎంఆర్‌ఐలుగా పిలుస్తామన్నారు.
కక్ష సాధింపులు టీడీపీ మోటో కాదన్న లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే ధ్యేయమన్నారు.
భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారంటే ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని నేతలకు సూచించామన్నారు లోకేష్
164సీట్లతో కూటమి ఘన విజయం వెనుక లోకేష్ పాత్ర ఉంది, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని పాదయాత్ర చేశారన్నారు నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్