Pawan Kalyan Varahi Deeksha: పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభం, 11 రోజులపాటు పాలు, పండ్లు, ద్రవాహారం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
2023 జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.
గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం గెలిచిన పవన్ కళ్యాణ్ పార్టీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ సహా అందరూ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సైతం తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గి, అసెంబ్లీలో కాలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. ప్రజలతో మమేకమయ్యే శాఖలు తీసుకున్నామని పవన్ ఇటీవల చెప్పారు.