Pawan Kalyan: ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లిన పవన్ కల్యాణ్- సీఎం సిద్ధారామయ్యతో చర్చలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రే చర్చలు జరిపారు.
చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం.
కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరారు.
కుంకీ ఏనుగులు కోసం కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు.
కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా కన్నడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
వన్య ప్రాణి, అటవీ సంరక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో ప్రస్తుతం అనుసరిస్తున్న వన్య ప్రాణి, అటవీ సంరక్షణ విధానాలు కూడా పవన్‌ను సిద్దారామయ్య అడిగి తెలుసుకున్నారు.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు అభినందనలు తెలిపారు.
కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేను పవన్‌కు పరిచయం చేస్తున్న సీఎం సిద్దరామయ్య
ఈ చర్చల కోసం బెంగళూరు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ రాష్ట్ర బయోఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సురేంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు.