In Pics: చంద్రబాబుకు పూలతో ఆహ్వానం, ఘనంగా అమరావతి రైతుల ఏర్పాట్లు - ఫోటోలు
చంద్రబాబుకు అమరావతి ప్రాంతానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి.. ఏకంగా వేలాది ఎకరాల భూములను సేకరించారు. అప్పట్లో ఎన్ని సమస్యలు వచ్చినా దాదాపు 35 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించగలిగారు.
చంద్రబాబు తన పాలనలో అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినప్పటికీ, వాటిని తాత్కాలిక భవనాలుగా పిలవడంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించలేదు. పైగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతి ప్రాంత రైతులు కదం తొక్కాల్సి వచ్చింది.
అలా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు సుమారు నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అమరావతి రైతులో సంతోషంలో ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకొనే జూన్ 13న సాయంత్రం ఆయనకు పూలతో స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత వాసులు ఇలా భారీ ఎత్తున పూలను సిద్ధం చేశారు.
గత రెండు రోజులుగా చంద్రబాబుకు స్వాగతం పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయానికి వచ్చే సమయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం కోసం ఆ ప్రాంత రైతులు ఇలా భారీ ఎత్తున పూలను సిద్ధం చేశారు.