Mamitha Baiju Photos: బ్లాక్ డ్రెస్ లో ప్రేమలు బ్యూటీ మమితా బైజు - పుష్పరాజ్ లా తగ్గేదే లే అన్నట్టు ఫోజిచ్చింది!
ప్రేమలు సినిమాతో ఊహించనంతగా భారీ హిట్ అందుకుంది మలయాళ హీరోయిన్ మమిత బైజు. ఈ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు మలయాళంలో చాలా సినిమాల్లో నటించినా ప్రేమలు మూవీ తన కెరీర్ని మలుపు తిప్పేసింది.
మలయాళంలో బ్లాక బస్టర్ అయిన ప్రేమలు మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి తీసుకొచ్చారు..ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది. మలయాళంలో తన సినీ కెరీర్ ప్రారంభించిన బ్యూటీ పదికి పైగా సినిమాల్లో నటించింది...
సోషల్ మీడియాలోనూ మమితకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువే. సేమ్ టు సేమ్ మమితాలా రీల్స్ చేస్తున్నారు...అలా సౌత్ లో ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..
లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ తో మమితా షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
మమిత బైజు ఫోటోలు (Images Source : Instagram/Mamitha Baiju)