Janaki Kalaganaledu Vishnu Priya Photos: కుందనపు బొమ్మ నిను చూస్తూ రెప్ప వేయడం మరిచా - జానకి కలగనలేదు మల్లిక ఫొటోస్ చూసిన నెటిజన్ల రియాక్షన్ ఇదే!
జానకి కలగనలేదు సీరియల్‌లో అల్లరి మల్లికగా మెప్పించింది విష్ణు ప్రియ. అంతకుముందు తెలుగుతో పాటూ తమిళంలోనూ పలు సీరియల్స్ లో నటించింది. సీరియల్ నటుడు సిద్దార్ధ వర్మని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ.. భర్తతో కలసి దిగిన ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తుంటుంది
హైదరాబాద్ వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న విష్ణుప్రియ...నిలదొక్కుకునేందుకు రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చింది. స్టార్టింగ్ లో 1500 ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు 15 వేలకు చేరిందని సంతోషంగా చెబుతుంది...
ఆ రోజు సిద్దార్థవర్మని పెళ్లిచేసుకోవాలనే నిర్ణయం తన లైఫ్ లో ఎప్పటికీ బెస్ట్ డెసిషన్ అంటుంది విష్ణుప్రియ. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అనుమతి లభించడం చాలా అదృష్టం అని..ఇప్పుడు వారు లేకపోయినా ఎప్పటికీ వారి ఆశీశ్సులు తనపై ఉంటాయంటుంది. విష్ణుప్రియ సిద్దార్థవర్మకి ఓ కొడుకున్నాడు...
అమర్ దీప్ తనకన్నా పెద్దవాడైనా కానీ తనని అక్కా అని పిలిచేవాడని..అందుకే తన పెళ్లి బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నానంది విష్ణు ప్రియ. అయితే బ్రదర్ అని పిలవడం అలవాటు అయి...జానకి కలగనలేదు సీరియల్ లో బావగారూ అని పిలవడం కష్టంగా ఉండేదట. ఈ సీరియల్ లో మల్లిక గా చేసిన అల్లరికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారంటోంది విష్ణుప్రియ
Image credit: vishnupriyaaofficial /Instagram