CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారిగా చంద్రబాబు తిరుమల పర్యటన - కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు.
శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి శిరస్సు వంచి నమస్కరించిన సీఎం చంద్రబాబు.
శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేశ్ దంపతులకు పండితులు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు.
తిరుమల దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులకు స్వామి వారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.
శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు అశేష భక్తజనానికి ఆత్మీయంగా అభివాదం చేశారు.
శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు అఖిలాండం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఆయన్ను చూసేందుకు భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
దర్శనం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు భక్తులకు అభివాదం చేశారు.