Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: ముగిసిన అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహా పాదయాత్ర
అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర నేటితో ముగిసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర ప్రచార రథం చేరగానే 108 కొబ్బరికాయలు కొట్టి జేఏసీ ప్రతినిధులు పాదయాత్రను ముగించారు
అమరావతి రైతుల గోవింద నామస్మరణతో అలిపిరి ప్రాంతమంతా మారుమోగింది. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి హోరెత్తింది
నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజుకు అలిపిరిలో ముగిసింది.
44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 450 కి.మీ. పైగా మహా పాదయాత్ర చేశారు.
చివరి రోజు మహాపాదయాత్రకు పెద్దఎత్తున తరలివచ్చి రైతులు రాజధాని అమరావతికి జై కొట్టింది.
ఇవాళ తిరుపతికి చేరుకున్న రైతుల పాదయాత్ర నగరంలో 9 కి.మీ. మేర సాగింది.
ఒక్క చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు రైతులకు స్వాగతం పలికారు.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరుపతి వీధుల్లో అమరావతి ఆకాంక్షను వినిపిస్తూ పాదయాత్ర సాగింది.
రేపటి నుంచి మూడు రోజులపాటు రోజుకు 500 మంది చొప్పున రైతులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు
టీటీడీ నిబంధనలు అనుసరించి తాము నడుచుకుంటామని రైతులు స్పష్టం చేశారు.
సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ రైతులు భావోద్వేగానికి లోనయ్యారు.
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17వ తేదీన తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. సిద్ధమవుతున్నారు.