YSR Telangana Party Chief YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాజకీయాల్లో మరో మలుపు తిరగబోతున్నాయి. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSR Telangana Party)తో తెలంగాణ(Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్‌ షర్మిల(YS Sharmila) మరో కీలకమైన స్టెప్ వేయబోతున్నారు. జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్‌(Congress)లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో చర్చలు జరిగిపోయినట్టు రెండు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. 


ముహూర్తం ఫిక్స్


జనవరి(January) మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ(Delhi) వేదికగా షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అనంతరం ఎన్నికల సమయం నాటికి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSR Congress Party), టీడీపీ(Telugu Desam Party) జనసేన(Janasena) కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమాలో వాళ్లు ఉన్నారు. బీజేపీ(BJP) ఉన్నప్పటికీ పోటీలో లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి షర్మిల వెళ్లడంతో ద్వారా పార్టీకి ఎంత వరకు మేలు జరుగుతుందనే చర్చనీయాంశం. 


ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ 


తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. తమ ఓటు బ్యాంకు జగన్‌కు వెళ్లిపోయిందని గ్రహించిన హస్తం నేతలు ఇప్పుడు షర్మిలను చేర్చుకొని ఆ ఓటు బ్యాంకు తిరిగి పొందాలని భావిస్తున్నారు. అసలు తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయినింగ్‌ను వాయిదా వేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో వ్యతిరేకత వస్తుందని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ లీడర్లే టార్గెట్!


షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే అంశంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతోపాటు సోనియా, రాహుల్‌తో సమావేశాలు ముగిసినట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ను జగన్ వీడటం, విభజన నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి చెందిన ప్రధానమైన ఓటు బ్యాంకు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయింది. ప్రధానంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఆ ఓటు బ్యాంకు పొందటానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. దీని కారణంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. చాలా మంది నేతలు వేర్వేరు పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు టీడీపీ, జనసేన, బీజేపీలోకి వెళ్లలేక వైసీపీలో ఉండలేక ఉక్కపోత అనుభవిస్తున్నారు. అలాంటి వారందరి కోసం కాంగ్రెస్ ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తోందని టాక్ నడుస్తోంది. 
ఇప్పుడు జగన్ వైఖరి నచ్చక, ఆయనతో ఉండలేక వేరే పార్టీల్లోకి వెళ్లలేని వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారని అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పుడు నాయకులతో అది సాధ్యమయ్యేది కాదని... షర్మిల లాంటి ఫేస్ ఉంటే కచ్చితంగా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారని అంచనా వేసుకుంటున్నారు. అందుకే షర్మిల చేరికను స్వాగతిస్తున్నారు నాయకులు