Brown Bread: ప్రపంచవ్యాప్తంగా బ్రెడ్ చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఉదయాన్నే ఈజీగా తినేయగల బ్రేక్‌ఫాస్ట్ ఇదే. బ్రెడ్ శాండ్ విచ్, బ్రెడ్ డంప్లింగ్ ఇలా ఎన్నో రకాలుగా బ్రెడ్ తింటారు. అయితే ఫిట్ నెస్ గురించి ఆలోచించే వారు మాత్రం వైట్ బ్రెడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్ తినేందుకు ప్రాధాన్యమిస్తారు. మైదా నుంచి వైట్ బ్రెడ్ తయారవుతుంది. కాబట్టి చాలా మంది బ్రౌన్ బ్రెడ్ తింటుంటారు. అయిదే బ్రౌన్ బ్రెడ్‌ రంగు నిజంగా గోధుమలతో తయారు చేస్తారా? అది అంత కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు రసాయనాలు ఏమైనా కలుపుతారా? అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణులు ఏం చెప్పారంటే..


అసలు విషయాలు తెలుసుకొనే ముందు.. బ్రౌన్ బ్రెడ్‌లోని పోషకాల గురించి చూద్దాం:


బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలతో తయారు చేస్తారు. గోధుమలను పాలిష్ చేయకుండా పూర్తి గోధుమలను పిండిగా చేసి దాంతో బ్రెడ్ తయారు చేస్తారు. గోధుమలకు ఉండే పొట్టు తీయరు దానివల్ల మీకు అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. అలాగే పోషక తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. 


సహజమైన గోధుమ పిండిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి, ఫైబర్ అలాగే మెగ్నీషియం ఐరన్ వంటి ఖనిజలవణాలు కూడా ఉంటాయి. వైట్ బ్రెడ్ తో పోల్చి చూసినట్లయితే బ్రౌన్ బ్రెడ్ తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు బ్రౌన్ బ్రెడ్ తిన్నప్పుడు మీ కడుపు ఖాళీగా అనిపించదు. పూర్తిగా నిండిన అనుభూతి కలుగుతుంది. ఇలా ఉండటం వల్ల మీరు డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


ఎక్కువ బ్రౌన్ కలర్ ఉంటే అనుమానించాల్సిందే


బ్రౌన్ బ్రెడ్ నిజంగానే బ్రౌన్ కలర్ లో ఉంటుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రౌన్ బ్రెడ్ కాస్త ఎక్కువగానే బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. సాధారణంగా ఆర్గానిక్ పద్ధతుల్లో గోధుమ పిండితో తయారుచేసిన బ్రెడ్ ఈ రంగుల్లో ఉండదు. బ్రౌన్ బ్రెడ్ తయారీలో సహజసిద్ధమైన పద్ధతుల్లోనే  బ్రెడ్ తయారీ విధానం ఉంటుంది. డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బ్రౌన్ బ్రెడ్.. ఆర్గానిక్ గోధుమపిండితో తయారుచేసిన బ్రెడ్ రంగుతో పోల్చితే కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో కొన్ని సంస్థలు సాధారణ బ్రెడ్‌లోనే బ్రౌన్ కలర్ మిక్స్ చేసి అమ్ముతున్నట్లు డైటీషియన్లు అనుమానిస్తున్నారు. మీరు నిజమైన బ్రౌన్ బ్రెడ్ తినాలి అనుకున్నట్లయితే.. సహజ సిద్ధంగా తయారు చేసే సర్టిఫికేషన్ ఉన్న సంస్థల వద్ద బ్రెడ్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.


మన ఆరోగ్యానికి బ్రౌన్ బెడ్ ఎలా సహకరించుతుందో చూద్దాం:


బ్రౌన్ బ్రెడ్‌లో పుష్కలంగా పీచు పదార్థం ఉంటుంది. ఫలితంగా ఇది మీకు జీర్ణశక్తిని కలగ చేస్తుంది. ఈ పీచు పదార్థం మీ రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు డయాబెటిస్ రాకుండా కూడా సంరక్షించే అవకాశం ఉంది. 


బ్రౌన్ బ్రెడ్ గుండెకు కూడా చాలా మంచిది. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషక విలువలు మెగ్నీషియం మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దీంతోపాటు ఇందులో ఉండే మెగ్నీషియం మీ రక్తపోటును తగ్గిస్తుంది.


Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.