Train New App : రైలు ప్రయాణాల్లో చికాకు కల్పించే అంశం ఏది అని ఓ సారి రివ్యూ చేసుకుంటే మొదటగా గుర్తొచ్చే సమస్య.. మన సీట్లో వెరెవరో కూర్చోవడం. ఎంత లేపినా లేవకపోవడం.. టిక్కెట్ కలెక్టర్లకు.. ఇతరులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పెద్ద సమస్య. అదే సమయంలో బెర్తుల్లోకి వచ్చి కూర్చునేవారు కూడా ఉంటారు. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కారనికి రైల్వే కొత్త ప్రయత్నం చేస్తోంది. ప్రయాణికులుకు మంచి ప్రాయణ అనుభవం కల్పించే లక్ష్యంతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
కనిపించని విపక్షాల ఐక్యత - రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ సూచిస్తున్నదేమిటి ?
రైల్వే కొత్తగా ‘రైల్వే మదద్’ యాప్ అందుబాటులోకి తెచ్చింది. అందులో ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ కాని సీట్ల లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా యాప్ తెచ్ిచంది. ఉమంగ్ ( UMANG ) యాప్ ద్వారా ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు లైవ్ స్టేటస్‌ని ట్రాక్ చేసే సదుపాయం కూడా ఈ యాప్‌లో కల్పించారు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి లేదా సలహాలను అందించడానికి రైల్వే ఈ యాప్‌ని అభివృద్ధి చేసింది. ఫిర్యాదుల సత్వర , సంతృప్తికరమైన పరిష్కారంతో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం ఈ పోర్టల్ లక్ష్యమని రైల్వే శాఖ చెబుతోంది.
మరో మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారు - బీజేపీపై ఢిల్లీ సీఎం ఆరోపణలు !
ఉమంగ్ లేదా మదద్ ద్వారా ఎలా ఫిర్యాదు దాఖలు చేయాలంటే.. మందుగా రైల్వే మదద్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత Send OTPపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వేగంగా వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే అందులో నమోదు చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ మీద ఉండే పీఎన్‌ఆర్ నెంబర్‌ను కూడా నమోదు చేయాలి. తర్వాత టైప్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును ఎంచుకోవచ్చు. సమస్య ఏమిటో టైప్ చేసి.. తేది సెలక్ట్ చేసి సెండ్ చేస్తే.. సత్వరం రైల్వే అధికారులు స్పందిస్తారు.
దయచేసి ఇలాంటి సాహసాలు చేయకండి, థార్ వీడియోపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఎవరైనా మీ రిజర్వ్ చేసిన సీటును వదిలి వెళ్లడానికి నిరాకరిస్తే, మీరు రైలులో ఉన్న రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) సిబ్బంది నుండి సహాయం పొందవచ్చు. అంతేకాకుండా, మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి డయల్ చేసి అక్కడ ఫిర్యాదు చేయవచ్చు. రైలు ప్రయాణాల్ో మన సీటును మనం కాపాడుకోవడమే చాలా క్లిష్టమైన అంశం. రద్దీగా ఉండే రైళ్లలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే రైల్వే మదద్, ఉమంగ్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసి.. మన సౌకర్యాల్ని మనం పొందవచ్చు.