Year Ender 2022:
మరి కొద్ది రోజుల్లో 2022 కి గుడ్‌బై చెప్పేసి 2023కి స్వాగతం పలుకుతాం. కొత్త ఆశలతో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు రెడీ అయిపోతు న్నారంతా. ఇప్పటికే సోషల్ మీడియాలో న్యూ ఇయర్‌పై పోస్ట్‌లు, మీమ్స్ తెగ షేర్ చేస్తున్నారు. అయితే...గతేడాదితో పోల్చి చూస్తే...ఈ ఏడాది సోషల్ మీడియా వినియోగం పెరిగింది. అంతే కాదు. Gen-Z కొత్త కొత్త అబ్రివేషన్స్‌తో పోస్ట్‌లు, మెసేజ్‌లు చేసుకున్నారు. కట్టెకొట్టె తెచ్చే ఫార్మాట్‌లో సూటిగా సుత్తి లేకుండా చిన్న చిన్న మెసేజ్‌లతోనే తాము చెప్పాలనుకుంది కన్వే చేసేస్తారు. ఈ క్రమంలోనే..ఈ ఏడాది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయిన అబ్రివేషన్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
Most Used Social Media Abbreviations:
1. LOL: LOL అంటే "Laughing Out Loud" అని అర్థం. గట్టిగా నవ్వడం అన్నమాట. 2022లో ఎక్కువగా వినియోగించిన అబ్రివేషన్ ఇదే. ఎవరైనా "కడుపుబ్బా నవ్వుతున్నా" అని చెప్పడానికి ఈ మెసేజ్ పంపుతారు. ఎప్పటి నుంచో ఇది వాడుకలో ఉన్నా...ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్ అయింది.
2. ASAP: ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. As Soon As Possible అని అర్థం. అయితే...ఈ అబ్రివేషన్‌ను నెగటివ్ సెన్స్‌లో వాడతారని చెబుతారు. అంటే ఓ పని వీలైనంత త్వరగా పూర్తైపోవాలని డిమాండ్ చేయడాన్ని సూచిస్తుంది ఈ అబ్రివేషన్. అంతే కాదు. ఈ అబ్రివేషన్‌ను రూడ్ క్యాటగిరీలో చేర్చారు. ఈ ఏడాది ఎక్కువగా ఇదే ట్రెండ్ అయిందట.
3. FYI: For Your Information అని అర్థం. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన కొత్తలోనే ఈ పదం పుట్టింది. కాకపోతే...వాడుకలోకి రావడానికి చాన్నాళ్లు పట్టింది. ఒకరి అటెన్షన్‌ను డ్రా చేయడానికి ఈ అబ్రివేషన్ ఎక్కువగా వినియోగిస్తారు.
4. G2G: Got to go అనే మాటకు G2G అనే అబ్రివేషన్ వినియోగిస్తారు. టెక్ట్స్ మెసేజ్‌లలో, ఈమెయిల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఇదే ఎక్కువగా ట్రెండ్ అయింది. అప్పటికప్పుడు సంభాషణను ముగించి వెళ్లిపోవాలంట ఈ అబ్రివేషన్ వాడతారు. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే...దీనికి మరో అబ్రివేషన్ కూడా ఉంది. ఏదైనా మంచి పని మొదలు పెట్టే ముందు "Good to go" అని అంటారు. దీన్ని కూడా G2Gగానే ఇండికేట్ చేస్తారు.
5. TTYL: Talk To You Later అని అర్థం. ఆన్‌లైన్‌లో ఎక్కువగా వినియోగించిన అబ్రివేషన్ ఇది. అత్యవసరంగా వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు ఇది వాడతారు. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎక్కువగా వినియోగించారు. టాక్ టూ యూ లేటర్ అని టైప్ చేసేంత టైమ్ లేనప్పుడు సింపుల్‌గా ఈ అబ్రివేషన్ పంపేస్తారు.
6. IKR: దీనర్థం "I know, Right" 1990ల్లోనే ఈ అబ్రివేషన్‌ను కనుగొన్నారు. అయితే...2004 తరవాత కానీ ఇది వాడుకలోకి రాలేదు. అయితే...ఇది కాస్త నెగటివ్ సెన్స్‌లో వినియోగిస్తారు. అంటే ఎదుటి మనిషి చెప్పే విషయం ముందే తెలుసు అని కాస్త పొగరుతో చెప్పడం అన్నమాట. ఇది కూడా ఈ ఏడాది బాగా ట్రెండ్ అయింది.
Also Read: Year Ender 2022: 2022లో జరిగిన మెగా కొనుగోళ్లు &విలీనాలు