Passport Ranking: ప్రపంచంలోని ప్రతి దేశ పౌరులకు విదేశాలకు వెళ్లడానికి వేర్వేరు వీసా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడకు వెళ్లడానికి వీసా అవసరం. అది లేకుంటే ఆ దేశంలో కాలు పెట్టడానికి లేదు. దాని ఆధారంగానే ఆ దేశంలోకి ప్రవేశం లభిస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాలకు ప్రదేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు. అలా ఎన్ని దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చో అనే క్రైటీరియా ఆధారంగానే ఒక దేశం పాస్‌పోర్ట్ శక్తిని గుర్తిస్తారు. ఇటీవల, ప్రపంచ పాస్‌పోర్ట్‌లకు సంబంధించి ఒక ర్యాంకింగ్ విడుదలైంది. ఈ ర్యాంకింగ్‌ను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఏ దేశం పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనదో ఇది తెలియజేసింది. ఏ దేశం పాస్‌పోర్ట్ బలహీనంగా ఉందో కూడా ఇది పేర్కొంది. ఏ దేశం పాస్‌పోర్ట్ బలహీనమైంది...పాకిస్తాన్ ఏ స్థితిలో ఉందో ఇక్కడ సవివరంగా చూద్దాం.
పాకిస్తాన్ పరిస్థితి దారుణం
పాకిస్తాన్ పాస్‌పోర్ట్ 2025లో దిగువ నుంచి నాల్గో ఉంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో పాకిస్తాన్ పాస్‌పోర్ట్ కంటే దిగువన ఉన్నవి కేవలం మూడు దేశాల పాస్‌పోర్ట్‌లు మాత్రమే, ఇవి హింస, అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతున్న దేశాలు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న పౌరులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 32 దేశాల్లో మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. అంటే, ఆ దేశాలలో పాకిస్తానీలు ముందుగా వీసా తీసుకోకుండానే వెళ్ళవచ్చు. అయితే ఇందులో ప్రపంచంలోని ప్రధాన దేశాల పేర్లు లేకపోవడం పాకిస్తాన్ దుస్థితికి అద్దం పడుతోంది. గ్లోబల్ ర్యాంకింగ్ ప్రకారం, పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో నాల్గో బలహీనమైన పాస్‌పోర్ట్‌గా గుర్తింపు పొందింది.
అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్ ఏ దేశానిది!
ఈ జాబితాలో పాకిస్తాన్ కంటే బలహీనమైన పాస్‌పోర్ట్‌లను కూడా ఇచ్చారు. ఇందులో యెమెన్, సోమాలియాను 96వ స్థానంలో ఉంచారు. అదే సమయంలో పాకిస్తాన్ కంటే దిగువన ఇరాక్ ఉంది. ఇది 97వ స్థానంలో ఉంది. సిరియా 98వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 99వ స్థానంలో ఉంది.
ఈ నాలుగు దేశాల ర్యాంకింగ్ పాస్‌పోర్ట్ విషయంలో చాలా దారుణంగా ఉంది. 2024 నివేదికలో పాకిస్తాన్ పాస్‌పోర్ట్ యెమెన్‌తో కలిసి నాల్గో బలహీనమైన పాస్‌పోర్ట్‌గా నమోదు అయ్యింది. అయితే 2025లో పాకిస్తాన్ ర్యాంకింగ్ ఒక పాయింట్ మెరుగుపడింది. కానీ ఇది ఏమాత్రం ఆ దేశానికి ప్రయోజనం చేకూర్చలేదు. .
పాస్‌పోర్ట్‌లను ఎవరు ర్యాంక్ చేస్తారు
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 199 పాస్‌పోర్ట్‌లు, 227 దేశాల ప్రయాణ సౌకర్యాలను వివరిస్తుంది. ఇది ఏ పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలలో వీసా లేకుండా, వీసా ఆన్ అరైవల్, ఇ-వీసా లేదా ట్రావెల్ పెర్మిట్‌తో ప్రయాణించవచ్చో చూస్తుంది. వాటి ఆధారంగానే ఆ దేశం పాస్‌పోర్టు శక్తిని గుర్తిస్తుంది. ఎక్కువ దేశాలకు ఇలాంటి ట్రావెలింగ్ సౌకర్యం ఉంటే అదే శక్తిమంతమైన దేశంగా గుర్తిస్తారు.
భారతదేశం ర్యాంక్ ఏమిటి
భారతదేశం గురించి మాట్లాడితే, ఈ నివేదికలో భారతదేశానికి గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశం గత ఆరు నెలల్లో 8 స్థానాలు ఎగబాకింది. 2024 నివేదికలో భారతీయ పాస్‌పోర్ట్ 85వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 77వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో, అమెరికా, బ్రిటన్ ర్యాంక్ క్రమంగా పడిపోతోంది. అమెరికా ఇప్పుడు 10వ స్థానంలో ఉండగా, బ్రిటన్ 6వ స్థానానికి చేరుకుంది.