Teacher Used Students For Intercourse : అమెరికాలో ఇరవై ఆరేళ్ల ఓ లేడీ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు చెప్పమంటే ఆ పని చేయకుండా శృంగార పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఓ పదహారేళ్ల విద్యార్థితో కోరికలు తీర్చుకోవడం ప్రారంభించింది. ఈ పని చేస్తున్న సమయంలో తాము ఉన్న వైపు ఎవరూ రాకండా ఇతర విద్యార్థుల్ని కాపలా పెట్టేది. ఈ వ్యవహారం బయటకు రావడంతో టీచర్ పై కేసు పెట్టారు. ప్రస్తుతానికి ఆమెను హౌస్ అరెస్టులో ఉంచారు. అక్టోబర్‌లో శిక్షను ఖరారు చేయబోతున్నారు. నేరం నిరూపణ అయిపోయింది.
ఇతర విద్యార్థుల్ని కాపలా ఉంచి సరసాలు
మిస్సోరిలోని ఓ స్కూల్‌లో గత జనవరిలో విద్యార్థితో టీచర్ శృంగారం చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి వీపుపై గోళ్లతో గీచినట్లుగా గుర్తులు ఉన్నాయి. వాటిని తన సహచర విద్యార్థికి మరో విద్యార్తి చూపించాడు. వాటిని తాము శృంగారం చేస్తున్న సమయంలో తన్మయత్వంతో టీచర్ చేసిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి.. స్కూల్ యాజమాన్యంకు తెలిసింది. స్కూల్ యాజమాన్యం అంతర్గత విచారణ జరిపింది. నిజంగానే ఆ టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందని తరచూ స్కూల్లోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్తోందని తెలుసుకున్నారు. అక్కడ మరికొంత మంది విద్యార్థుల్ని కాపలా పెట్టి పనిపూర్తి చేసి వచ్చేదని తేల్చారు.
ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో చిరునవ్వుతోనే డొనాల్డ్ ట్రంప్‌ను తొక్కిపడేసిన కమలాహారిస్
విచారణ జరిపి నిజమేనని తేల్చిన పోలీసులు
విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారులపై వేధింపులు, రేప్ కేసులు పెట్టారు. అయితే తర్వాత తాను ఏమీ చేయలేదని వాదించడంతో బెయిల్ ఇచ్చారు. కానీ విచారణ మాత్రం సాగుతోంది. అయితే విచారణలో ఆమె రేప్ చేసినట్లుగా తేలడంతో అక్టోబర్ పదకొండో తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. ముస్సోరి చట్టాల ప్రకారం ఆ టీచర్ కు నాలుగేళ్ల వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
ముషారఫ్ భూమిని అమ్మేసిన భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌లో ఉన్నది కాదు ఇక్కడిదే !
నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం
ఆ టీచర్ స్కూల్లోనే తన లైంగిక ఆసక్తులు, ప్రైవేటు వ్యవహారాలపై చర్చించే వారని విద్యార్థులు తెలిపారు. ఆమె తీరుతో విసుగు చెందిన భర్త కూడా విడాకులు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే టీచర్ ఫోన్ లో విద్యార్థితో జరిపిన అసభ్య సంభాషణలు.. ఇతర వివరాలను పోలీసులు కనిపెట్టారు. అలాగే తమను కాపలా పెట్టి .. ఆ విద్యార్థితో టీచర్ శృంగారన్ని జరిపేవారని ఇతరులు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఈ టీచర్ వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశం అయింది.