US Lightning Strike: అమెరికాలోని అధ్యక్ష భవనం శ్వేత సౌధం వద్ద పిడుగు పాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు అధికారులు తెలిపారు.






ఇలా జరిగింది






శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న లఫాయెట్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురు వ్యక్తుల దగ్గర పిడుగు పడిందని అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


పిడుగు పాటు అనంతరం అక్కడకు చేరుకున్న సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పార్క్‌ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారికి వెంటనే చికిత్స అందించారు. ముందుజాగ్రత్తగా పార్క్‌లో కొంత భాగాన్ని అధికారులు గంట సేపు మూసివేశారు. 


మరో ఘటన


అమెరికాలోనే మరో ఘోర ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఇంట్లో మొత్తం 14 మంది ఉండగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 


Also Read: Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్


Also Read: Punjab News : ఆరు రూపాయలతో కోటీశ్వరుడు, అదృష్టమంటే ఈ కానిస్టేబుల్ దే!