US Crime News: 


నగ్నంగా రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి..


అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఓ వ్యక్తి నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. ఓ పోలీస్‌ ఆఫీసర్‌పై దాడి చేసి ప్యాట్రోల్ కార్‌ని (US Patrol car) దొంగిలించాడు. ఆ కార్‌తో మరో కార్‌ని ఢీకొట్టాడు. అక్టోబర్ 31న రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ వ్యక్తి  నగ్నంగా రోడ్డుపై తిరుగుతున్నాడంటూ పోలీసులకు స్థానికులు కాల్ చేశారు. వెంటనే ఓ పోలీస్ ఆఫీసర్‌ అక్కడికి వెళ్లారు. అరెస్ట్ చేయాలని ప్రయత్నించగా...ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ఆ తరవాత దాడి చేశాడు. ఈ దాడిలో పోలీస్ ఆఫీసర్ కింద పడిపోయాడు. వెంటనే ఆ వ్యక్తి పోలీస్‌ కార్‌లో ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తరవాత కాసేపటికే ఆ పోలీస్ కార్ క్రాష్ అయింది. వేగంగా వెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టాడు ఆ వ్యక్తి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. నగ్నంగా తిరిగిన వ్యక్తికి కూడా ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే అతనిపై కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. 


"నగ్నంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ వచ్చారు. అరెస్ట్ చేసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారనుకున్నాను. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి పోలీస్‌పై దాడి చేయడం మొదలు పెట్టాడు. తనను తాను రక్షించుకునేందుకు దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీస్ కింద పడిపోయాడు. ఆ తరవాత ఆ వ్యక్తి పోలీస్ కార్‌ ఎక్కి పరారయ్యాడు"


- ప్రత్యక్ష సాక్షి