భారతీయులపై బ్రిటన్ విధించిన క్వారంటైన్ నిబంధనలపై దుమారం రేగుతోంది. కోవిషీల్డ్ టీకాకు గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించిన బ్రిటన్ మరో కొత్త తిరకాసు పెట్టింది. తమకు కోవిషీల్డ్ టీకాతో ఎలాంటి సమస్య లేదని.. దానికి అందించే కోవిన్ (CoWIN) ధ్రువపత్రంతోనే అని గందరగోళం కలిగించే వ్యాఖ్యలు చేసింది. కోవిషీల్డ్‌ను ఆమోదించిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చుతున్నట్లు ఇటీవల బ్రిటన్ ప్రకటించింది. కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికులు ఎలాంటి నిబంధనలు పాటించాలనే విషయాలతో ట్రావెల్ అడ్వైసరీని రూపొందించింది.


కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా కూడా.. క్వారంటైన్‌లో ఉండాలని తాజా నిబంధనల్లో పేర్కొంది. తమకు టీకాతో ఎలాంటి ఇబ్బంది లేదని.. దానికి ఇచ్చే కోవిన్ సర్టిఫికెట్లతోనే అని సాకులు చెప్పింది. ఇదే విషయంపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వెల్లడించింది. యూకే ఇటీవల విడుదల చేసిన అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు అక్టోబరు 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో యూకే ప్రయాణాలపై అస్పష్టత నెలకొంది. 


Also Read: Covid 19 Vaccine Export: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే


యూకే ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం (DHSC) ఈరోజు దీనిపై వివరణ ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా కోవ్‌షీల్డ్, ఆస్ట్రాజెనెకా వాక్స్జీవేరియా, మోడెర్నా టకెడా అనేవి ఆమోదించిన టీకాలుగా గుర్తించినా కూడా తాము ధృవీకరించలేకపోతున్నట్లు తెలిపింది. దీనిపై మరింత స్పష్టత అవసరమని పేర్కొంది. యూకే రావడానికి 14 రోజుల ముందు రెండు డోసులు టీకాలు వేసుకోవడం తప్పనిసరి అని డీహెచ్ఎస్సీ సలహాదారుడు వెల్లడించారు. 


మొదటి నుంచి గందరగోళమే.. 
కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై యూకే ఆంక్షలు విధించింది. ఈ దేశాల నుంచి వచ్చే వారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా.. వారిని టీకా తీసుకోని వారి మాదిరిగా పరిగణిస్తామని ప్రకటించింది. దీంతో భారత్ సహా ప్రపంచ దేశవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సైతం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని లేకుంటే ప్రతిచర్య తప్పదని యూకేను హెచ్చరించాయి. దీంతో ఈ నిర్ణయంపై బ్రిటన్ వెనక్కుతగ్గింది. కొవిషీల్డ్‌కు గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా ట్రావెల్ అడ్వైసరీ నిబంధనల్లో మరోసారి మార్పులు చేయడంతో యూకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Also Read: PM Modi Update: ప్రధాని మోదీ అమెరికా టూర్.. గ్లోబల్ సీఈవోలతో సెప్టెంబర్ 23న కీలక భేటీ


Also Read: Guinness World Record: ఈ అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు... గిన్నీస్ బుక్‌లో చోటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి