TikTok Working again In US: ఒకప్పుడు ఇండియాలో ఓ ఊపు ఊపేసిన టిక్ టాక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో పాపులర్ అయిన ఈ షార్ట్ వీడియో యాప్ ను ఇప్పుడు అమెరికాలోనూ నిషేధిస్తారనే వార్తలు గత కొన్ని రోజులుగా వ్యాపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కొత్తం చట్టం ప్రకారం, జనవరి 19 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వచ్చింది. అన్ని సేవలనూ నిలిపివేస్తున్నట్టు టిక్ టాక్ కూడా స్పష్టం చేసింది. అయితే కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో టిక్ టిక్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. యూజర్లకు తిరిగి సేవలను పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.
పోస్టులో టిక్ టాక్ ఏం చెప్పిందంటే..
అమెరికా టిక్ టాక్ సేవల పునరుద్దరణపై చేసిన పోస్టులో "మా సర్వీస్ ప్రొవైడర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. టిక్ టాక్ మళ్లీ అమెరికాలో సర్వీసులు ప్రారంభించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొనే పెనాల్టీలపై ఆయన హామీ ఇచ్చారు. ఫలితంగా 17 కోట్ల మంది అమెరికన్లకు టిక్ టాక్ సేవలు అందుతాయి. 70 లక్షల చిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇది ఏకపక్ష సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన బలమైన స్టాండ్. టిక్ టాక్ ను తిరిగి కొనసాగిస్తూ దీర్ఘ కాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి పని చేస్తాం" అని ఓ స్టేట్ మెంట్ పేరుతో రాసింది.
యాప్ లోనూ సందేశంతో వెల్కమ్
ఈ క్రమంలోనే యాప్ లోనూ యూజర్లకు ఓ మెసేజ్ కనిపించేలా టిక్ టాక్ ఏర్పాటు చేసింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత టిక్ టాక్ ను పునరుద్ధరించడానికి తమతో కలిసి పనిచేస్తానని సూచించడం తమ అదృష్టం అని యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అప్పటి వరకూ తమతోనే ఉండాలని అభ్యర్థించింది. అంతకుముందు టిక్ టాక్ ను నిలిపివేయడంతో.. యూఎస్ లో చట్టం ప్రకారం టిక్ టాక్ ను ఉపయోగించలేరు అని చూపించింది.
50 శాతం వాటాపై ట్రంప్ కామెంట్స్
ఈ క్రమంలోనే అమెరికాలో టిక్ టాక్ తిరిగి అందుబాటులోకి వస్తుందని ఆదివారం ట్రంప్ స్పష్టం చేశారు. బైడెన్ పాలనను స్టంట్ గా అభివర్ణించిన ట్రంప్.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని, డివెస్ట్-లేదా-బ్యాన్ చట్టాన్ని ఆలస్యం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. తన ప్రమాణం తర్వాత ఈ ఆర్డర్ పై సంతకం చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ లో 50శాతం వాటాపైనా ట్రంప్ స్పందించారు. అందుకు అంగీకరించాలని చెప్పారు. అంతకు ముందు విక్టరీ ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. టిక్ టాక్ తిరిగి వస్తుందని చెప్పారు. తాము తమ వ్యాపారాని చైనాకు గానీ, ఇతరులకు గానీ అప్పగించాలని అనుకోవడం లేదని చెప్పారు. ఇదీని ద్వారా తమ దేశ పౌరుల డేటా చైనాకు చేరుతోందనే అనుమానాలూ వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా భారత్ తో పాటు అనేక దేశాలలో టిక్ టాక్ సేవలు 2017 నుంచి నిలిచిపోయాయి.
Also Read : White House: అధ్యక్ష అధికార నివాసంలో అడుగుపెట్టిన ట్రంప్... గత స్మృతులను గుర్తుచేసుకున్న కుటుంబ సభ్యులు