Christmas 2024 : క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది. క్రిస్మస్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది శాంతా క్లాజ్. శాంతా క్లాజ్ గురించి ఇప్పటికే మీరు చాలా కథలు విని ఉండొచ్చు. ఈ రోజున పిల్లలందరికీ గిఫ్ట్స్, చాక్లెట్లు తీసుకువస్తాడని నమ్ముతారు. అయితే అసలు ఇంతకీ శాంతా క్లాజ్ నిజంగానే ఉన్నాడా.. లేదంటే అదొక కల్పిత పాత్రనా అన్న విషయం చాలా మందికి తెలియదు. అసలు ఆ డౌట్ కూడా రాదు చాలా మందికి. అయితే శాంతా క్లాజ్ కు సంబంధించిన వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. శాంతా క్లాజ్ వెనుక ఉన్న వ్యక్తి మైరాకు చెందిన సెయింట్ నికోలస్ నిజమైన ముఖాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ ఫేస్ ను మొదటిసారి 1700లో చూపించారు. శాంతాక్లాజ్‌ని సెయింట్ నికోలస్, సెయింట్ నిక్, ఫాదర్ క్రిస్మస్, క్రిస్ క్రింగిల్ అని కూడా పిలుస్తారు.


క్రైస్తవుడైన సెయింట్ నికోలస్ నిజమైన ముఖాన్ని ఇప్పుడు ప్రపంచం చూడగలుగుతోంది. నికోలస్ బహుమతులు ఇచ్చే చిత్రం అతన్ని శాంతా క్లాజ్‌గా చేసింది. క్రమంగా, ఇది తరువాత క్రిస్మస్‌తో ముడిపడింది. అలా పిల్లలు ఇప్పటికీ శాంతా క్లాజ్ పాత్రను ఇష్టపడే విధంగా బహుమతులు ఇచ్చే సంప్రదాయం పెరిగింది.


తొలిసారిగా శాంతాక్లాజ్ ముఖాన్ని చూడనున్న ప్రపంచం 


మైరాకు చెందిన సెయింట్ నికోలస్ ముఖాన్ని, తలను నిపుణులు ఫోరెన్సికల్‌గా పునర్నిర్మించారని ఓ వార్తా పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అతనికి అపారమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ, సెయింట్ నికోలస్ గురించి నిర్దిష్ట వివరణ లేదు. కానీ ఇప్పుడు ప్రజలు అతని సజీవ ముఖాన్ని మొదటిసారి చూడగలుగుతారు.


ఓ నివేదిక ప్రకారం.. నికోలస్ తల చాలా దృఢంగా కనిపిస్తుందని, దీని వల్ల ముఖం దృఢంగా ఉంటుందని ఈ స్టడీ హెడ్ సిసిరో మోరేస్ తెలిపారు. అతని ముఖం 1823లో వచ్చిన ఓ కవిత ఎ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్‌లో ఉన్న దానితో సరిపోలిందని చెప్పాడు. ఈ కవితలోని చిత్రంలో, మందపాటి గడ్డంతో ఏర్పడిన ముఖం శాంతాక్లాజ్‌ను గుర్తు చేస్తుంది. 






నికోలస్ ముఖాన్ని ఎలా క్రియేట్ చేశారంటే..


తాను, తను బృందం 1950లో లుయిగి మార్టినో సేకరించిన డేటాను ఉపయోగించినట్లు మోరేస్ చెప్పారు. "మేము మొదట ఈ డేటాను ఉపయోగించి అతని తలని 3Dలో పునర్నిర్మించాము. ఆపై గణాంక (ఎథిక్స్ ఎక్స్‌టెన్షన్) అంచనాలను ఉపయోగించి ముఖ రూపురేఖలను అన్వేషించాం" అని ఆయన వివరించారు.


శాంతాక్లాజ్‌ ఊహాజనితమైన వ్యక్తి  కాదు..


శాంతాక్లాజ్‌ ఓ ఊహాజనితమైన వ్యక్తి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన నిజంగానే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడాయన భూమ్మీద లేడు. అప్పట్లో శాంతాక్లాజ్‌ సమాధిని కూడా టర్కీకి చెందిన పురావస్తుశాఖ వారు కనుగొన్నారు. దక్షిణ టర్కీ అంటాల్యా ప్రొవిన్స్‌లోని డేమేరే జిల్లాలో ఉన్న చర్చి కింద శాంతాక్లాజ్‌ సమాధి ఉందని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. ఇన్నేళ్లయినా ఈ సమాధి చెక్కు చెదరకపోవడం విశేషం. మైరా బిషప్‌గా ఉన్న నికోలస్‌ బతికినంత కాలం క్రిస్మస్‌కు ముందు రోజు పిల్లలకు కానుకలను ఇచ్చేవారట. తన ఆదాయాన్నంతా పేద పిల్లలకే ఖర్చు పెట్టేవాడట. అప్పట్లో శాంతాక్లాజ్‌ వేడుకలు డిసెంబర్‌ ఆరున జరిగేవని సమాచారం. ఆ తర్వాతి కాలంలో డిసెంబర్‌ 24కు మారింది. ఆ రోజున శాంతాక్లాజ్‌ ఆకాశంలో పయనిస్తూ పిల్లలకు కానుకలు ఇస్తాడని నమ్మకం. క్రీస్తుశకం 343లో శాంతాక్లాజ్‌ మరణించారు.


Also Read : Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి