దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని లాక్ డౌన్‌తో మరణాలను నివారించింది. కానీ.. పరోక్షంగా దేశ ప్రజలు జీవనోపాధిని కోల్పోయి, ఆకలితో అలమటించిపోయారు. లాక్‌డౌన్ సమయంలో ఆకలి, రుణాలు తీవ్ర ఒత్తిడిని కలగజేశాయి. మరీ ముఖ్యంగా తినేందుకు తిండి లేక.. చేసేందుకు పని లేక.. ప్రాణాలను అరి చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవించారు కోట్లమంది.


దశలవారీగా లాకౌడౌన్ మూడు నెలలు వరకు పొడిగిస్తూ వచ్చింది. దీని కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవనోపాధిని కోల్పోయారు. ఉపాధి లేక కాలినడకనే ఇంటిదారి పట్టారు. పట్టణాల్లో ఉపాధి కోల్పోవడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వలస కార్మికులు ప్రత్యేక రైళ్లలో తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితి కేవలం భారత్‌లోనే కాదు.. లాక్‌డౌన్‌ విధించిన ఆయా దేశాల ప్రజలు.. తీవ్రంగా ఇబ్బందులకు గురి అయ్యారు.


ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఓ తల్లి తన సొంత కూతుళ్లను, ఓ కొడుకును వ్యభిచారంలోకి దింపింది. అవును.. చదివేందుకే చాలా ఇబ్బందికరంగా ఉన్న ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిలిప్పీన్స్‌ దేశంలోని కన్నతల్లి తన కూతుళ్లను వ్యభిచారంలోకి దించింది. అయితే ఇలా ఎందుకు.? చేస్తున్నారని ప్రశ్నించగా.. కోవిడ్‌ మహ్మమ్మారి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.


కోవిడ్ ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్ విధించారని, ఆ సమయంలో డబ్బుకు ఇబ్బందైదని, బయటకు వెళ్లి ఏదైన పని చేద్దాం అనుకున్నా.. అలాంటి పరిస్థితి లేకపోవడంతో చేసేదేమిలేక తన పిల్లలతోనే వ్యభిచారం చేపించి, ఆ వీడియోలతో డబ్బులు సంపాధిస్తున్నట్లు తెలిపారు. ఇలా షూట్‌ చేసిన వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో వీడియోకి తన తల్లికి 20 డాలర్లు చెల్లిస్తున్నాడని చెప్పుకొచ్చారు ఆ చిన్నారులు.


ఫిలిప్పీన్స్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న  శ్మశానవాటిలో వీళ్ల ఇళ్లు ఉంది. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ఆ దేశ పోలీస్‌ అధికారులు.. ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలోనే ఓ బాలుడు.. ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ ఇంట్లో సెక్స్‌ టాయ్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌తోపాటు మరికొన్ని ఆధారాలను సేకరించారు. ఈ చిన్నారులను వెంటనే అదుపులోకి తీసుకుని, చిల్డ్రన్స్ హోంకు తరలించారు.


ఇలా ఎందుకు చేస్తున్నారని పోలీసులు ఆ చిన్నారులను ప్రశ్నించగా వాళ్లు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. వారి తల్లి, ఓ ఆంటీ, అంకుల్‌ తమను వీడియోలు తయారు చేశారని తెలిపారు. ఇలా చేసినందుకు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, యూరప్‌ నుంచి డబ్బులు వస్తున్నాయని వెల్లడించారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో తమకు పూట గడవటానికే ఇబ్బందిగా ఉండేదని, అలాంటి సమయంలో ఇదొక్కటే సరైన దారిగా కనిపించిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి వల్ల ఫిలిఫీన్స్‌లో లైంగిక దోపిడీ, బాలలపై అఘాయిత్యాలు చాలా పెరిగిన్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 


ఇప్పుడిప్పుడే ప్రపంచం కరోనా గాయాల నుంచి కోలుకుంటున్నా... కొందరు మాత్రం తేరుకోలేకపోతున్నారు. సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇంకా సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు.