Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 నెలలు దాటిన తర్వాత అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఉక్రెయిన్‌కు నేరుగా సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందుకొచ్చారు. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించేందుకు బైడెన్ అంగీకరించారు.
ఎప్పటి నుంచో
రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచే అత్యాధునిక ఆయుధ సంపత్తి కావాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరుతోంది. అయితే ఐరోపా దేశాలు తప్ప అమెరికా నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు పెద్దగా సాయం ఏం అందలేదు. కానీ చివరికి బైడెన్.. ఉక్రెయిన్‌కు రాకెట్ లాంఛర్లు అందించేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 80 కిలోమీటర్ల రేంజ్‌లోని లక్ష్యాలను నాశనం చేస్తాయి ఈ రాకెట్లు.
కానీ
అయితే ఉక్రెయిన్ భూభాగంపై రష్యా దాడులను తిప్పికొట్టడానికే తప్ప రష్యా భూభాగంలో మాత్రం ఆ రాకెట్లను ప్రయోగించడానికి వీల్లేదని షరతు పెట్టారు బైడెన్. ఈ మేరకు బైడెన్ బుధవారం స్వయంగా ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్ నుంచి హామీ తీసుకున్న తర్వాతే ఈ సాయానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే ఆయుధ ప్యాకేజీలో రాకెట్ వ్యవస్థలు, మందు గుండుతో పాటు కౌంటర్ ఫైర్ రాడార్లు, ఎయిర్ సర్వేలెన్స్ రాడార్లు, జావెలిన్ యాంటీ టాంక్ మిస్సైల్స్, యాంటీ ఆర్మర్ వెపన్స్ ఉండనున్నాయి.
3 నెలలు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై మే 24 నాటికి 90 రోజులైంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. ఇది పైకి కనిపించేది. అయితే యూరోప్ దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ మూడు నెలల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యాయి.
రష్యా మొదలుపెట్టిన ఈ దాడి ఇప్పట్లో పూర్తి కాదని ఐరోపా నిఘా విభాగాలు ముందే అంచనా వేశాయి. అయితే ఇది ప్రపంచాన్నే వణికిస్తుందని మాత్రం అనుకోలేదు. ఉక్రెయిన్‌ను నామ రూపాల్లేకుండా చేయడానికి రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఐరోపా దేశాలకు యుద్ధం మొదలైన తర్వాతే అర్థమైంది.
Also Read: UPSC 2021: ఎంత పనిచేశారు భయ్యా! ఐశ్వర్య అంటే అమ్మాయ్ అనుకున్నాంగా!
Also Read: Hurricane Agatha: మెక్సికోలో 'అగాథ' హరికేన్ బీభత్సం- 10 మంది మృతి