Russia-Ukraine War Latest News: ఫిబ్రవరి నెలాఖర్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. అప్పటినుంచి ఎన్నో దఫాలుగా చర్చలు జరుపుతూనే మరోవైపు ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపించింది రష్యా. అయితే యుద్ధం మొదలైనప్పటినుంచి ఆదివారం వరకు రష్యా 2,002 సాయుధ వాహనాలు, 148 యూఏవీలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. 


యుద్ధంలో నష్టంపై ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటన 
ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ ద్వారా యుద్ధానికి సంబంధించి పలు వివరాలు షేర్ చేసుకున్నారు. తమ దేశంపై రష్యా యుద్ధం (Russia Ukraine War) మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపుగా 20,300 ఆర్మీ సిబ్బంది, 773 యుద్ధ ట్యాంకులు, 2002 సాయుధ వాహనాలు, 376 ఆర్టిలరీ సిస్టమ్స్, 127 రాకెంట్ లాంచర్స్, 66 యూనిట్ల వైమానిక దళ సామాగ్రి, 165 విమానాలు, 146 హెలికాప్టర్లు, 1,471 ఆటోమేటిక్ ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఓడలు, పడవలు కలిపి 8 వరకు  రష్యా నష్టపోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ బహిర్గతం చేశారు. 


వాటితో పాటు 76 ఇంధన ట్యాంకులు, 148 ఆపరేషనల్ టాక్టికల్ యూఏవీలు, 27 యూనిట్ల స్పెషల్ ఫోర్స్ సామాగ్రి, 4 ఆపరేషనల్ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్‌ను సైతం రష్యా ఆర్మీ కోల్పోయిందని ఉక్రెయిన్ పేర్కొంది. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకెళ్తున్న ఓ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చివేసింది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కన్సెన్‌కోవ్ తెలిపారు. రష్యా ఎయిర్ ఫోర్స్ శనివారం డజన్ల కొద్దీ ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.


Also Read: Russia Ukraine War : మళ్లీ కీవ్‌పై రష్యా దాడులు ! ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు ? 


అల్టిమేటం జారీ..
మరియాపోల్‌లో ఉన్న సైనికులు ఆయుధాలు వదిలేసి తమకు లొంగిపోవాలని ఉక్రెయిన్ ఆర్మీకి రష్యా అల్టిమేటం జారీ చేసింది. లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని హామీ ఇస్తున్నామని రష్యా ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. జెనీవా ఒప్పందం ప్రకారం లొంగిపోయిన వారిని యుద్ధ ఖైదీలుగా భావించి వారికి సదుపాయాలు కల్పిస్తామని, హామీ ఇచ్చింది. మరోవైపు మరియాపోల్ నగరం చాలా వరకు రష్యా ఆధీనంలోనే ఉన్నా, ఉక్రెయిన్ ఆర్మీ మాత్రం వెనకడుకు వేయడం లేదు. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని, రోజురోజుకూ క్షీణించి పోతుందని అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా లక్ష మంది వరకు ఉన్నారని రష్యా భావిస్తోంది.


Also Read: Instagram Village: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు



, Russia, Ukraine War, Ukraine Crisis