పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్‌ అసెంబ్లీ రణరంగంగా మారింది. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐకి చెందిన ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌పై దాడి చేశారు. పీటీఐ నేతల దాడిలో డిప్యూటీ స్పీకర్‌ దోస్త్‌ మహ్మద్‌ మజ్రీ గాయపడ్డారు. పీటీఐ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్‌ను చెప్పులతో కొట్టి , జుట్టుపట్టుకుని ఈడ్చేశారు.  కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం సమావేశమైన అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.



ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. 














పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు డిప్యూటీ స్పీకర్‌ దోస్త్‌ మహ్మద్‌ మజ్రీ సభకు అధ్యక్షత వహించడానికి వచ్చారు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐ ఎమ్మెల్యేలు అతనిని అడ్డుకుని తీవ్రంగా కొట్టారు.  ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీని వీడి ప్రతి పక్షాలకు మద్దతిచ్చిన నేతలపై తిట్ల దండకం వినిపించారు. తర్వాత దాడులకు దిగారు.  



ఇమ్రాన్ ఖాన్ పదవి పోగొట్టుకున్న తరహాలోనే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కూడా రిస్క్‌లో పడింది. లాహోర్‌ హైకోర్టు ఆదేశాలను అనుసరించి, పంజాబ్‌లో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం సభ నిర్వహించారు.  కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉండగా కొట్టుకున్నారు. ఏకంగా స్పీకర్‌నే కట్టడంతో  ముఖ్యమంత్రి ఎన్నిక వాయిదా పడింది. తనను కొట్టిన వారిని వదిలి పెట్టబోనని స్పీకర్ ప్రకటించారు. ఆయనకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి కట్లు కట్టించారు.