Mysterious liver illness seen in kids in US, Europe :  అమెరికా  , యూరప్ చి‌న్నారుల్లో అంతుబట్టని కాలేయ వ్యాధులు వెలుగు చూస్తున్నాయి. వందల సంఖ్యలో ఇలాంటి కేసులు వెలుగు చూస్తూండటంతో పలు దేశాల్లో వైద్యాధికారులు రహస్య పరిశోధనలు చేస్తున్నారు. ఈ వ్యాధి.. జలుబుతో సంబంధం ఉన్న ఒక రకమైన వైరస్‌కు సంబంధించినదని వారు భావిస్తున్నారు. హెపటైటిస్ , కాలేయ మంటతో వచ్చిన  74 మంది చిన్నారుల కేసులను  యూకే పరిశోధిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది.స్పెయిన్‌లో ఇలాంటి మూడు కేసులు వెలుగుచూశాయి. ఐర్లాండ్‌లో కొన్ని కేసులపై పరిశోధన చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఈ విషయాలను వెల్లడించింది.  


ప్రపంచంపై చైనా మరో కుట్ర ! పాకిస్థాన్‌లో ఏం చేస్తోందంటే ?


అమెరికా ఆరోగ్య అధికారులు ఇలాంటి తొమ్మిది కేసులను పరిశీలిస్తున్నారు. అమెరికాలో బయటపడిన కేసులన్నీ అలబామాలోనివే. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు.  అమెరికాలో వ్యాధి బయటపడిన వారి వయసు ఆరేళ్ల లోపు ఉంటుంది. ఇద్దరికి కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు తేల్చారు. యూరోప్‌లో బయటపడుతున్న కేసులుకూడా ఆరేళ్ల వయసులోపు ఉన్న పిల్లలకే వస్తున్నాయి.  


స్కాట్లాండ్‌లో కాలేయ సమస్యలతో బాధపడుతున్న 10 మంది పిల్లల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీసినప్పుడు ఒకే తరహా లక్షణాలతో పలు దేశాల్లో పిల్లలు బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఇవి అసాధారణ అనారోగ్యాలని నిర్ణయానికి వచ్చారు.  కాలేయం పోషకాలను ప్రాసెస్ చేస్తుంది, రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాలేయం పనితీరు మందగిస్తే ప్రాణానికే ప్రమాదం. ఇప్పటి వరకూ బ్రిటన్‌లో అరవై నాలుగు కేసులు గురతించారు. ఎవరూ చనిపోలేదు కానీ ఆరుగురికి కాలేయ మార్పిడి అవసరం అయింది. 


10 రోజుల్నించి క్రమంగా పెరుకున్న కరోనా కేసులు ! దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చేస్తోందా ?
  
ప్రయోగశాల పరీక్షలో హెపటైటిస్ రకం A, B, C, E వైరస్‌లు సాధారణంగా ఇటువంటి అనారోగ్యాలకు కారణమవుతాయని నిర్ధారించారు. చాలా వరకు జలుబు వంటి లక్షణాలు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలు ఈ వైరస్ బారిన పడిన పిల్లల్లో కనిపిస్తున్నాయి.  కొంతమంది యూరోప్ పిల్లలలో అడెనోవైరస్ పాజిటివ్ అని తేలింది, మరికొందరికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.  అలబామా ఆరోగ్య అధికారులు నవంబర్ నుండి పిల్లలలో హెపటైటిస్ పెరుగుదలను పరిశీలిస్తున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లలకు వస్తున్న ఈ ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేయిస్తోంది.