ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సైనికులు ఆయుధాల్ని పక్కనపెట్టాలని రష్యా తాజాగా హెచ్చరించింది. తక్షణమే ఆయుధాలు పక్కన పెట్టాలని ఉక్రెయిన్ బలగాలకు పిలుపునిచ్చింది.
అల్టిమేటం
ఓడరేవు నగరం మరియాపోల్‌ను ఇప్పటికే రష్యా సేనలు ముట్టడి చేశాయి. దీంతో మరియాపోల్ రక్షకులు తమ ప్రతిఘటనను ఆపేయాలని కొత్త అల్టిమేటం జారీ చేసింది. తలాతోకలేని ఉక్రెయిన్ యోధుల పోరాటాన్ని ఆపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది.
50 రోజులు
ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం 50 రోజులు దాటింది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు.
ఫిబ్రవరి నెలాఖర్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. అప్పటినుంచి ఎన్నో దఫాలుగా చర్చలు జరుపుతూనే మరోవైపు ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపించింది రష్యా. అయితే యుద్ధం మొదలైనప్పటినుంచి ఈ నెలవ 17 వరకు రష్యా 2,002 సాయుధ వాహనాలు, 148 యూఏవీలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.
ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ ద్వారా యుద్ధానికి సంబంధించి పలు వివరాలు షేర్ చేసుకున్నారు. తమ దేశంపై రష్యా యుద్ధం మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపుగా 20,300 ఆర్మీ సిబ్బంది, 773 యుద్ధ ట్యాంకులు, 2002 సాయుధ వాహనాలు, 376 ఆర్టిలరీ సిస్టమ్స్, 127 రాకెంట్ లాంచర్స్, 66 యూనిట్ల వైమానిక దళ సామాగ్రి, 165 విమానాలు, 146 హెలికాప్టర్లు, 1,471 ఆటోమేటిక్ ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఓడలు, పడవలు కలిపి 8 వరకు రష్యా నష్టపోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ బహిర్గతం చేశారు.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
Also Read: Anonymous Hackers: శ్రీలంకపై ఆ హ్యాకర్ల పంజా- ఏం చేసుకుంటారో చేసుకోమని ట్విట్టర్‌కు సవాల్