అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ కాబూల్‌లో పేలుళ్ళు జరిగాయి. ఓ హైస్కూలులో జరిగిన ఈ పేలుళ్ళలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఎవరు చేశారు?
ఈ పాఠశాల పరిసరాల్లో కొందరు షియా హజరా తెగకు చెందినవారు ఉన్నారు. వీరు మతపరమైన అల్ప సంఖ్యాకులు. వీరిపై సున్నీ ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఓ హైస్కూలులో రెండు పేలుళ్ళు జరిగినట్లు సమాచారం. షియా ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.
తాలిబన్ల పాలన
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్‌ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు.
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్‌కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్‌ను వదిలి వెళ్లాయి. అప్గాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందాయి.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం
Also Read: KGF Chapter 3 : మన రాకీ భాయ్ కన్ను ఈ బంగారపు గనులపై పడితే..?