ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ లొంగిపోతే.. తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్‌పై దాడి విషయంపై రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది.






రష్యా ప్రకటన



ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక దాడి గురించి వివరాలను వెల్లడించింది రష్యా రక్షణ శాఖ



• 243 మంది ఉక్రెయిన్ సైనికులు సరెండర్


• మెరైన్ సైనిక విభాగం సరెండర్


• 118 సైనిక వాహనాలు ధ్వంసం. ఇందులో 11 వాయుసేన స్థావరాలు.13 కమాండ్, సమాచార కేంద్రాలు 300 క్షిపణులు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయి.


• ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్, 5 డ్రోన్లు కూల్చివేత.


• 18 ట్యాంకులు, 7 రాకెంట్ లాంఛర్లు, 41 సైనిక వాహనాలు, 5 యుద్ధ పడవలు ధ్వంసం.


• చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.




ఉక్రెయిన్ ప్రకటన


ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు ఘర్షణల్లో చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. కీవ్ నగరంలోకి అడుగుపెట్టిన రష్యా సేనలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుతున్నారు.


మీటింగ్


ఉక్రెయిన్​, రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ దేశాల నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. ఓ స్వతంత్ర దేశాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తోన్న రష్యాను నిలువరించాలని ఉక్రెయిన్​ అద్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కోరారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ మాట్లాడారు. ఉక్రెయిన్​తో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ​