రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు మొత్తానికి ఫలించాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగినట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ ప్రకటించారు.
రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్ నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకరించింది. శాంతి చర్చలపై ఉక్రెయిన్‌కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
నెల రోజుల్లో
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు మొదలుపెట్టి నెల రోజులు దాటిపోయాయి. ఈ నెల రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు వైమానిక దాడులు చేశాయి, ఎన్నో నగరాలను హస్తగతం చేసుకున్నాయి. యూరోప్.. దశాబ్దాలుగా చూడని హింసాత్మక ఘటనలను ఈ నెల రోజుల్లో చూసింది. రష్యా మొదలుపెట్టిన ఈ దాడి వల్ల మాస్కోకు, పశ్చిమ దేశాలకు మధ్య ఇక పూడ్చలేని దూరం ఏర్పడింది. ఈ ఒక్క యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ఆకలి చావులు మొదలయ్యే పరస్థితులు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ జవాబు
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభాలో పావు వంతు అంటే కోటి మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసవెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, మాల్డోవాకు కూడా చాలా మంది శరణార్థులుగా వెళ్లిపోయారు.
జెలెన్‌స్కీ హీరో
ఈ యుద్ధంతో ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా జెలెన్‌స్కీ హీరో అయిపోయారు. రాజధాని కీవ్ నగరంలో రష్యా వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచే జెలెన్‌స్కీ రోజూ వీడియోలు పెడుతున్నారు. మరోవైపు 23 ఏళ్లలో నిర్మించుకున్న పుతిన్ ఇమేజ్.. ఈ యుద్ధంతో కాస్త తగ్గింది.
Also Read: COVID-19 Lockdown in China: అదే వైరస్, అదే భయం, అదే వణుకు- చైనాలో మళ్లీ లాక్‌డౌన్
Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది