ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర దాడుల గురించే ప్రపంచమంతా మాట్లాడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఇలా దాడి చేసింది.. అలా దాడి చేసింది.. అని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ సైనిక యుద్ధ చక్రాల కింద నలిగిపోతోన్న పసిపిల్లల భవిత గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఆక్రమణల మోజులో సైనిక చర్యలకు పాల్పడుతున్నారే కానీ.. పాలుతాగే పసిపిల్లల బాల్యం గురించి ఎవరికీ బాధ లేదు. పుతిన్.. ఇదేమైనా న్యాయమా?


నవజాత శిశువులు


అప్పుడే పుట్టిన నవజాత శిశువులు.. బాంబుల మోతలు వినాల్సి పరస్థితి. ప్రశాంతంగా బజ్జోవాల్సిన బుజ్జాయిలు తుపాకీ తూటాలతో ఉలిఉలికి పడుతున్నారు. అమ్మ ఒడిలో బజ్జొని పాలు తాగాల్సిన పసిపాపలు.. అండర్ గ్రౌండ్ షెల్స్‌లో తలదాచుకుంటున్నారు. పుతిన్ ఇదేమైనా న్యాయమా?


ఉక్రెయిన్ నగరాలపై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయనే వార్తలు విని ఆసుపత్రిలో పిల్లలను చేతబట్టుకుని బాంబ్ షెల్టర్లకు పరిగెడుతున్నారు. ద్నిన్‌ప్రో నగరంలో రష్యా క్షిపణి దాడులు చేస్తుండటంతో ఆసుపత్రిలో ఉన్న నవజాత శిశువులను బిల్డింగ్‌లోని బాంబ్ షెల్టర్లకు తరలించారు.


ఈ వీడియో చూసిన నెటిజన్లు హృదయాలను వేదనతో బరువెక్కిపోతున్నాయి. బాధతో కళ్ల నీళ్లు కారుతున్నాయి. ఉక్రెయిన్ నగరాలను బాంబుల మోతతో మార్మోగుతోన్న వేళ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.






వీడలేక






మరో వీడియోలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు తన భార్యబిడ్డల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించి.. తాను మాత్రం దేశం కోసం యుద్ధం చేయడానికి అక్కడే ఉండిపోయాడు. తన కూతురికి జాగ్రత్తలు చెబుతూ.. ఆ తండ్రి పడుతోన్న ఆవేదన చూస్తే జాలేస్తోంది. తన తండ్రిని వదిలి వెళ్లలేక ఆ కూతురు ఏడుస్తోన్న దృశ్యాలు ప్రపంచాన్నే కలచివేస్తున్నాయి.