Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. భీకరస్థాయిలో బంబుల వర్షం కురిపిస్తుంది. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో రష్యాపై మరోసారి అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ దిగుమతులపై నిషేధం విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆంక్షలపై అధికారిక ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలు ఈ ఆంక్షల విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని బైడెన్ అన్నారు. అయితే మిత్ర దేశాల పరిస్థితులను అర్ధం చేసుకోగలమన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక, భద్రత, హూమానిటేరియన్ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం నిర్ణయం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జో బైడెన్ అన్నారు. 


ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థన 


రష్యా నుంచి గ్యాస్‌, ముడిచమురు కొనుగోలు చేయొద్దని అమెరికా, ఐరోపా దేశాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. చమురు ఎగుమతులతో రష్యాకు పెద్ద ఎత్తున నగదు అందుతుందని పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై ఎక్కువగా లేదని యూఎస్ అధ్యక్షుడు బైడెన్‌ భావిస్తున్నారు. ఈ కారణంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా తన ఇంధన వినియోగంలో 8 శాతాని కిపైగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. 


జో బైడెన్ ప్రకటన 


"ఇవాళ నేను రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలనమైన ముడిచమురును లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మేము రష్యన్ చమురు, గ్యాస్, ఇంధనం అన్ని దిగుమతులను నిషేధిస్తున్నాం" అని బిడెన్ వైట్ హౌస్ లో ప్రకటించారు. "అంటే యూఎస్ ఓడరేవులలో రష్యన్ చమురు ఇకపై ఆమోదయోగ్యం కాదు. పుతిన్ యుద్ధ తంత్రానికి అమెరికన్ ప్రజలు మరో శక్తివంతమైన దెబ్బ కొట్టారు" అని బైడెన్ అన్నారు. 


రష్యా నుంచి 3 శాతం దిగుమతులు 


అమెరికా ఇంధనం, పెట్రోకెమికల్ తయారీదారులు (AFPM) ట్రేడ్ అసోసియేషన్ ప్రకారం 2021లో రోజుకు సగటున 209,000 బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. దేశం మొత్తం ముడి దిగుమతుల్లో ఇది 3 శాతం. అమెరికా తన ఇంధన సరఫరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడలేదు. యూరోపియన్ యూనియన్‌లోని సహజ వాయువులో దాదాపు 35 శాతం రష్యా నుంచి వస్తున్నందున ఐరోపా రష్యా ఇంధన సరఫరాలపై ఎక్కువ ఆధారపడుతుంది. యుఎస్ తన యూరోపియన్ మిత్రదేశాలలో చాలా మంది ఇదే విధమైన నిషేధాన్ని విధించే "స్థితిలో లేకపోవచ్చు" అని అర్థం చేసుకుంటుందని చెప్పారు. "అన్ని యూరోపియన్ దేశాల కంటే యునైటెడ్ స్టేట్స్ దేశీయంగా చాలా ఎక్కువ చమురును ఉత్పత్తి చేస్తుంది" అని యూఎస్ అధ్యక్షుడు చెప్పారు.