Putin’s daughter is dating a ‘Zelensky’: అలీనా కబాయెవా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో వల్డ్ వైడ్‌గా ఈ పేరు చక్కర్లు కొట్టింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శృంగార పురుషుడనే పేరు ఉంది. ఆయన ప్రియురాళ్ల జాబితా కూడా పెద్దదే. అందులో ప్రముఖమైన వ్యక్తినే ఈ అలీనా కబాయెవా. ఈమె మాజీ జిమ్నాస్ట్. పుతిన్‌కు చాలా దగ్గర వ్యక్తి. రష్యా రాజకీయాల్లో కీలక నేత కూడా. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ప్రతిభ చూపే అలీనా కబాయెవా ఖాతాలో రెండు ఒలంపిక్ పతకాలు ఉన్నాయి. అంతేకాదు, ఏకంగా 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ మెడల్స్ సాధించింది.
2014లో రష్యా నిర్వహించిన వింటర్ ఒలంపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా ఆమె (అలీనా కబాయెవా)నే ముందు నిలిచారు. అంతేకాదు.. రష్యా సీక్రెట్ ఫస్ట్ లేడీగా పిలుస్తారు. అయితే పుతిన్ రహస్య జీవితం గురించి ఎక్కువ తెలిసిన మహిళ అలీనా కబాయెవా అనే చెప్పాలి. పుతిన్ అలీనాల సీక్రెట్ లవ్ ఎఫైర్ గురించి ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో చాలా సార్లు ట్రెండ్ అయింది. అయితే పుతిన్ కుటుంబం గురించి ఎవరికీ స్పష్టమైన వివరాలు తెలియవు. ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలు మీడియా సమావేశాల్లో ఎదురైనా పుతిన్ వివరాలు వెల్లడించకుండా జాగ్రత్త పడతారు. 2015లో జరిగిన పెద్ద మీడియా సమావేశంలో కూడా ఆయన కుమార్తె గురించి అడిగిన ప్రశ్నలకు పుతిన్ సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ఇటీవల యూఎస్ విధించిన ఆంక్షల్లో పుతిన్ కుమార్తెలు మరియా వొరంత్సోవా(36), కేథరినా టిఖోనోవా(35) లక్ష్యంగా మారారు. ఈ క్రమంలోనే తాజాగా పుతిన్ కూతురు టిఖోనోవా ప్రేమ వ్యవహారం బయటపడింది. పుతిన్ ఇంట్లో మరో లవ్ అఫైర్ వివాదం మొదలైనట్లు కనిపిస్తోంది. రెగ్యూలర్ గా ప్రేమ వ్యవహారం, మహిళల విషయాలపై వార్తల్లో నిలిచే పుతిన్ కూతురు జెలెన్ స్కీ అనే వ్యక్తిని ప్రేమించింది. పుతిన్ చిన్న కూతురు కేథరినా టిఖోనోవా... జర్మనీలోకి చెందిన ఇగోర్ జెలెన్స్కీ అనే 51 ఏళ్ల వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్ ఇగోర్‌ను కలిసేందుకు 2018వ సంవత్సరం నుంచి 2019 మధ్య 60 సార్లు జర్మనీ వెళ్లి వచ్చిన రష్యాకు చెందిన మీడియా సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుండి ఎప్పుడూ రహస్యంగా ఉంచబడిన పుతిన్ ఇంకా అతని కుటుంబం యొక్క వ్యక్తిగత జీవితాలు బహిర్గతమయ్యాయి. అయితే ఉక్రెయిన్‌పై హిట్లర్‌లా యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇప్పుడు అదే హిట్లర్‌లా.. తన కూతురు ప్రేమకు అడ్డుపడుతాడా.? లేక గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? అనే అంశం సైతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.