Kim Jong Un Daughter Photo: కిమ్‌ జోంగ్‌ ఉన్‌... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే ఆయన ఏం చేసినా అది సంచలనమే. అంతేకాదు.. దేశాధినేతల్లో కిమ్‌జోంగ్‌ ఉన్‌ది ప్రత్యేక స్థానం. ఆయన ఏం చేసినా అది ఉత్తర కొరియా ప్రజల కోసమే అని నమ్మించే నేర్పరి ఆయన. ఆఖరికి మిసైల్‌ ప్రయోగాలు చేసినా కూడా, అది నార్త్‌ కొరియన్ల కోసమే అంటుంటారు కిమ్‌. మరీ ముఖ్యంగా తన పర్సనల్‌ లైఫ్‌ను ఎప్పుడూ బయటకు ఎక్స్‌పోజ్‌ చేసుకోరు. ప్రపంచ దేశాల దృష్టిలో నియంతగా చెలామణి అవుతోన్న కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా గోప్యత పాటిస్తారు.
కూతురిని పరిచయం చేసిన కిమ్‌..
తాజాగా నార్త్‌ కొరియా నియంత మరో సంచలనానికి తెరదీశారు. బాహ్య ప్రపంచానికి కూతురిని పరిచయం చేసిన కిమ్‌.. తన మదిలోని ఆలోచనను చెప్పకనే చెప్పాడు.  మొట్టమొదటిసారి తన కూతురిని బయటకు తీసుకొచ్చిన కిమ్‌.. ఏకంగా అణు క్షిపణుల దగ్గరకు తీసుకెళ్లడం సంచలనం రేపుతోంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న.. తన కూతురి రెగ్యూలర్‌ లైఫ్‌ను ఎంతో సీక్రెట్‌ ఉంచుతాడు కిమ్‌. ఓ సీక్రెట్‌ విల్లాలో తన కూతురు ఉంటుందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇంతకీ కిమ్‌ కూతురి విల్లా ఎక్కడ ఉంది.? ఆ చిన్నారి లగ్జరీ లైఫ్‌ ఎలా ఉంటుందో తెలుసా.? 


దక్షణ కొరియాలోని ఓ క్షిపణి ప్రయోగ ప్రాంగణం వద్దకు చేరుకున్న కిమ్‌.. తన కూతురి చెయ్యి పట్టుకుని ప్రయోగ వేదిక దగ్గరకు వెళ్లాడు. ఇక ఈ ఫొటోలు కొరియా న్యూస్‌ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చాయి. కూతురిని మీడియా ముందుకు, అదీ క్షిపణి ప్రయోగ ప్రాంతానికి తీసుకురావడంపై అక్కడి మీడియా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ఆ చిన్నారి పేరు చు-ఏ అని, ఆమె వయస్సు 12 నుంచి 13 ఏళ్లు ఉంటుందని అమెరికన్‌ రిటైర్డ్‌ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ డెన్నిస్‌ రాడ్‌మన్‌ చెబుతున్నారు. డెన్నిస్‌ 2013లో ఆటకు వీడ్కోలు చెప్పారు. తన నార్త్‌ కొరియా పర్యటనలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఫ్యామిలీని సైతం కలిశాడు డెన్నిస్‌. కిమ్‌కు ముగ్గురు పిల్లలు ఉండవచ్చని.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కావచ్చని, చు-ఏ వారిలో పెద్ద పిల్ల అయి ఉండవచ్చని విశ్లేషకులు ఊహిస్తున్నారు. 


(Photo Credit: Twitter/@_WORLD_ANALYSIS)


కిమ్ పర్సనల్ లైఫ్‌ చాలా సీక్రెట్ !
కిమ్ తన కుటుంబం గురించి అతి రహస్యాన్ని పాటిస్తారు. కిమ్ భార్య రి సోల్-జు గురించి కూడా వారి వివాహమైన కొంత కాలం వరకూ బయటకు తెలియలేదు. నాల్గో తరం అధికార వారసత్వం కూడా తమ కుటుంబం నుంచే వస్తుందని చెప్పడానికే కిమ్ కూతురిని పబ్లిక్‌లోకి తీసుకువచ్చి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన తర్వాత కూతురికే కిమ్‌ అధికార పగ్గాలు అప్పజెబుతారని.. అందుకోసం ఇప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తున్నారని, మెలకువలు నేర్పిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఆ చిన్నారి కాంగ్‌వాన్‌ ప్రావిన్సులోని వాన్సాన్‌ సముద్ర తీరంలో ఉన్న ఓ ప్రత్యేక, హై సెక్యూరిటీ విల్లాలో ఉంటుందట. అంతేకాదు.. ఓ దేశ ప్రెసిడెంట్లకు ఏదమైన సౌకర్యాలు ఉంటయో.. ఆ లెవల్లో చు-ఏకి.. ఫెసిలిటీలు ఉంటాయంటూ వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కిమ్‌ ఫ్యామిలీకి దక్షిణ కొరియా దేశ వ్యాప్తంగా 15 వరకు విలాస విల్లాలతో పాటు చాలా సీక్రెట్‌ టన్నెల్స్‌ కూడా ఉన్నాయట. ఈ సొరంగ మార్గాల్లో కేవలం కిమ్‌ ఫ్యామిలీ మాత్రమే ప్రయానిస్తోందట.