US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోరు చివరి దశకు చేరింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ నువ్వా నేనా అన్నట్టు ఫైట్ నడుస్తోంది. అయితే విజయం మాత్రం డొనాల్డ్ ట్రంప్‌ను వరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన 200కుపైగా ఎలక్టోరల్స్‌ను గెలుచుకున్నారు. కీలకమైన స్థానానాల్లో ట్రంప్ పై చేయి సాధించడంతో ఆయనకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. 


స్వింగ్ స్టేట్స్‌లోట్రంప్‌ హవా (swing states in US)
అమెరికా ఎన్నికల్లో పోటీదారుల భవిష్యత్‌ను తేల్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాల్లో హవా కొనసాగించారు. విస్కాన్సిన్, నార్త్ కరోలినా, అరిజోనా, పెన్సిల్వేనియా, జార్జియా, మిచిగాన్‌లో ట్రంప్‌ ఆధిక్యం కొనసాగించారు. వీటితోపాట మొత్తం 24 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. 


ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు:-  కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, కెంటకీ, టెన్సెసీ, మిస్సౌరి, మిస్సిస్సిప్పీ, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, ఇదాహో, వ్యోమింగ్, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమ్‌, టెక్సాస్‌, లుసియానా, ఆర్కాన్సస్‌, లోవా, ఇండియానా, హవాయీ


కమలా హారిస్ విజయం సాధించిన రాష్ట్రాలు:- వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూ మెక్సికో, ఇల్లినాయిస్, న్యూయార్క్, వేర్మాంట్‌, మస్సాచుసేట్స్, కెన్నెక్టికట్‌, రోడ్‌ ఐలాండ్, న్యూజెర్సీ, డెలావర్, మేరీల్యాండ్, కొలంబియా, వర్జీనియా,


ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు:- విస్కాన్సిన్(10), మిచిగాన్(15), పెన్సిల్వినియా(19), జార్జియా(16), ఆరిజోనా(11)


కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలు:- మిన్నెసోటా(10), మెయిన్(4), న్యూ హ్యాంప్‌షైర్‌(4) 


అలాస్కా, నెవాడా, హవాయిలో ప్రారంభంకాని కౌంటింగ్  


అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ కమలా హారిస్ గట్టిపోటీయే ఇస్తున్నారు. ఇంకా అలస్కా, నెవాడాలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. ఈ రాష్ట్రాలు ఎవరికి దక్కుతాయన్న విషయంపై క్లారిటీ వస్తే కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంలో స్పష్టత వస్తుంది. 


ఓట్ల శాతంలో ట్రంప్‌దే హవా


ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకొని 230 ఎలక్టోరల్స్‌లో ట్రంప్ గెలుచుకోగా... 210 ఎలక్టోరల్స్‌లో విజయం సాధించిన కమలా హారిస్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి 62,646,184 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓట్లలో ఇది 51% అన్నమాట. కమలా హారిస్ పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీకి 58,369,203 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 47.6%.