Peru Aliens Attacks:
పెరూలో ఏలియన్స్ కలకలం..!
లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో స్థానిక గ్రామస్థులు సంచలన విషయాలు చెప్పారు. ఏలియన్స్ తమపై దాడి చేశాయని, కొంత మంది ముఖాలను తినేశాయని చెప్పారు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అంతే కాదు. ఆ గ్రహాంతర వాసులు 7 అడుగుల ఎత్తు ఉన్నారని, ఉన్నట్టుండి తమపై దాడి చేశాయని గ్రామస్థులు ఆధారలతో సహా వెల్లడించారు. కొంత మంది కొన్ని ఫొటోలు చూపించి ఏలియన్స్ వచ్చాయని ప్రచారం చేశారు. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే స్థానికంగా ఇది చాలా ఆందోళనకు గురి చేస్తోంది. మరోసారి గ్రహాంతర వాసుల అంశం చర్చకు వచ్చింది. అయితే అధికారులు మాత్రం గ్రామస్థులు చెబుతున్న విషయాల్ని కొట్టి పారేస్తున్నారు. Pelakara తెగకు చెందిన కొందరు ఇలా దాడులు చేస్తూ ముఖాలను తినేస్తుంటారని వెల్లడించారు. వాళ్లను Face Eatersగా పిలుస్తారు. అక్రమ బంగారు మైనింగ్ సిండికేట్స్‌లో పని చేసే వీళ్లు చాలా క్రూరంగా ఉంటారని, సెంట్రల్ సౌత్ అమెరికాలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వివరించారు అధికారులు. స్థానికులు చెబుతున్న విషయాలు మాత్రం వేరుగా ఉన్నాయి.
"వాళ్లు 7 అడుగుల ఎత్తున్నారు. తలలూ చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ల శరీరం వెండి రంగులో ఉంది. జులై 11 నుంచి తరచూ దాడులకు పాల్పడుతున్నారు. బ్లాక్ హుడీలు వేసుకుని వచ్చి దాడులు చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్‌లా ఉన్నారు. కళ్లు పసుపు రంగులో ఉన్నాయి"
- స్థానికులు, పెరూ
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం...వాళ్లు అక్రమ మైనింగ్ మాఫియా సభ్యులు. జులై 29న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. గొంతు కోసి చంపారు. బాలిక శరీరంపై చాలా గాయాలు కనిపించాయి. ఇదే సమయంలో ఏలియన్స్ దాడి చేస్తున్నాయని గ్రామస్థులు చెప్పడంపై అధికారులు అక్రమ మైనింగ్ మాఫియాపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎడారిలో వింత ఆకారాలు..
ఏలియన్స్ (Aliens) కాన్సెప్ట్‌పై ఎన్నో డిబేట్‌లు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చి వెళ్తుంటారని, తమ ఉనికిని తెలియజేసేందుకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారని కొందరు వాదిస్తుంటారు. ఇదంతా ట్రాష్ అని కొందరు కొట్టి పారేస్తే...నిజమే అని ఇంకొందరు వాదిస్తారు. కానీ...ఇప్పటికీ సైంటిఫిక్‌గా ఏది నిజం అన్నది తేలలేదు. పలు సందర్భాల్లో UFOలు కనిపించడం మరింత మిస్టరీగా మారింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలోనే అక్కడక్కడా కొన్ని "అనూహ్య" సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ లేని ఎడారి ప్రాంతంలో నడి మధ్యలో ఓ చోట అంతు పట్టని సింబల్స్ కనిపించాయి. అమెరికాలోని పెరూ ఎడారిలో కనిపించాయివి. ఇవి ఎవరు గీశారు..? వాటి అర్థమేంటి అన్నది క్లారిటీ రావడం లేదు. కానీ ఇవి గీసి దాదాపు 2 వేల ఏళ్లు దాటినట్టు తెలుస్తోంది. అసలు ఎగ్జాగ్ట్‌గా ఆ సింబల్స్ ఏం చెబుతున్నాయన్నది సైంటిస్ట్‌లు ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...ఇవి సాధారణ మనుషులు గీసినట్టుగా కనిపించడం లేదు. అందుకే ఏలియన్స్ ఈ సింబల్స్ గీసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లే ఇక్కడికి వచ్చి ఇవన్నీ గీసి మనుషులకు ఏదో సిగ్నల్స్ ఇవ్వాలని ట్రై చేసి ఉంటారని ఓ వాదన వినిపిస్తోంది.
Also Read: Har Ghar Tiranga: ఇంటింటా జాతీయ జెండా ఎగరేయండి, పిలుపునిచ్చిన ప్రధాని మోదీ