Pak No Confidence Motion: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్ష పార్టీలు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థను ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోవడం లేదని పార్లమెంటులో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు.
ఎంత కావాలి?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులున్నారు. ప్రధానిని పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలను 272 మంది ఓట్లు అవసరం. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ నివాసంలో చర్చలు జరుపుతున్నారు. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
2018లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో తదుపరి జనరల్ ఎన్నికలు జరగనున్నాయి.
డిమాండ్
ప్రధాని పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు అంతకుముందు డిమాండ్ చేశాయి. ఇమ్రాన్ నేతృత్వంలో పాకిస్థాన్ ఆర్థికంగా మరింత దిగజారిపోయిందని ఆరోపించాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించాయి. అయితే ఆయన రాజీనామా చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
Also Read: Rupa Dutta Arrested: పిక్‌పాకెటింగ్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్- బుక్ ఫెయిర్‌లో బుక్కైపోయింది!
Also Read: Russia-Ukraine Crisis: పొలాండ్ సరిహద్దులో రష్యా క్షిపణి దాడులు- 35 మంది మృతి, 134 మందికి గాయాలు