Shehbaz Sharif Elected as PM: ఇస్లామాబాద్: పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ 24వ ప్రధానిగా ప్రధానిగా ప్రమాణం చేసిన షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు స్వీకరించారు. పాక్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరవాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. దాదాపు 16 నెలల పాటు పాకిస్థాన్‌కి ప్రధానిగా సేవలు అందించిన ఆయనతో ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆగస్టులో పాక్ పార్లమెంట్ రద్దు
గతేడాది ఆగస్టులో పాక్ పార్లమెంట్ రద్దు అయింది. గత నెలలో ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షెహబాజ్‌కే మరోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించాయి. మొత్తం 265 మంది ఉన్న జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI కి మద్దతునిచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ PML-N పార్టీ (Pakistan Muslim League-Nawaz ) 75 సీట్లు గెలుచుకుంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52 చోట్ల విజయం సాధించింది. ప్రధాని పదవికి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా పీటీఐ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరికి 201 మంది నేతలు షెహబాజ్ షరీఫ్‌కి అనుకూలంగా ఓటు వేశారు. పీటీఐ మద్దతు తెలిపిన నేత ఓమర్ ఆయుబ్ ఖాన్ ఓటింగ్‌లో ఓటమిచెందారు.
అనూహ్యంగా వెనక్కి తగ్గిన నవాజ్ షరీఫ్..
వాస్తవానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధానిగా ఎన్నికవుతారని అంతా ఊహించారు. అనూహ్యంగా ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ తెరపైకి వచ్చారు. పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం వల్ల మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపేందుకు నవాజ్ షరీఫ్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కేవలం 80 సీట్లే రావడం వల్ల మిగతా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2022లో పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పుకున్న తరవాత షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు పాక్ లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. షెహబాజ్ షరీఫ్ చాలా పద్ధతిగా ఆ పరిస్థితులను డీల్ చేశారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. IMF నుంచి బెయిల్ అవుట్ తెప్పించుకోడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిసిందే. ప్రధాని పదవి చేపట్టకముందు అతి పెద్ద ప్రావిన్స్ పంజాబ్‌కి 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. నాయకత్వ లక్షణాలు ఉండటంతో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నారు.
పాకిస్థాన్ఎన్నికల ప్రక్రియను `మదర్ ఆఫ్ ఆల్ రిగ్గింగ్` అని ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అందువల్లే నవాజ్ షరీఫ్ అనుకూల కూటమి విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ఖాన్‌ను ఆయన సోదరి అలీమా జైలులో కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ మెస్సేజ్‌ను వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ చీఫ్‌గా ఉన్న పీటీఐని పాకిస్థాన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల సంఘం కూడా పీటీఐకి గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంతో ఇమ్రాన్ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారని తెలిసిందే.